Navratri 2021: శరన్నవరాత్రులు.. అమ్మవారి తొమ్మిది రూపాలు.. ప్రత్యేక విశేషాలు!

First Published | Oct 2, 2021, 11:56 AM IST

ఈ ఏడాది శుక్లపక్షం ఆశ్వయుజ మాసం దశమి రోజు విజయదశమి పండుగ రానుంది. ఇక ఈ పండుగను హిందువులు ప్రధాన పండగగా భావిస్తారు. దేశం మొత్తం ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను దసరాగా పిలవబడతారు.

ఈ ఏడాది శుక్లపక్షం ఆశ్వయుజ మాసం దశమి రోజు విజయదశమి పండుగ రానుంది. ఇక ఈ పండుగను హిందువులు ప్రధాన పండగగా భావిస్తారు. దేశం మొత్తం ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను దసరాగా పిలవబడతారు. ఈ పండుగకు ముందు తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు వివిధ అవతారాల్లో పూజిస్తారు. అంతేకాకుండా ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని పూజిస్తే పది జన్మల పాపం తొలగిపోతుందని హిందువుల నమ్మకం. ఇక ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని ఏ అవతారాలతో పూజిస్తారో ఒకసారి తెలుసుకుందాం.

మొదటిరోజు: మొదటిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తుంది. పాడ్యమి రోజు ఈ అమ్మవారికి విశేష పూజలు చేస్తారు.

Latest Videos


రెండవ రోజు: రెండవ రోజు బాలత్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి కుమారి పూజ చేస్తారు.

మూడవరోజు: మూడవరోజు మూలశక్తి గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తుంది. మంత్ర జపంతో అమ్మవారికి పూజలు చేయడం వల్ల మంచి పుణ్యం దక్కుతుంది.

నాలుగవ రోజు: నాలుగో రోజు లలితా దేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈ రోజు చెరుకుగడను ధరిస్తుంది. ఇక సుహాసిని పూజ చేయడంతో దేవి అనుగ్రహం లభిస్తుంది.
 

ఐదవ రోజు: ఐదవ రోజు సరస్వతి దేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈరోజు అమ్మవారికి పూజ చేసినట్లయితే అజ్ఞాన తిమిరాన్ని తొలగిస్తుంది.

ఆరవ రోజు: ఆరవ రోజు అన్నపూర్ణ దేవి అవతారంలో దర్శనమిస్తుంది. పరమేశ్వరుడికి అన్నదానం చేసిన రోజు. ఈ రోజు అమ్మవారిని పూజిస్తే ధాన్యం లభిస్తుంది.
 

ఏడవ రోజు: ఏడవ రోజు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారిని పూజిస్తే సర్వమంగళకర యోగాలు దక్కుతాయి.

ఎనిమిదవ రోజు: ఎనిమిదవ రోజు దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఈ అవతారంలో అమ్మవారికి ఇష్టమైన ఎర్రని వస్త్రం, ఎర్రని అక్షితలతో పూజ చేస్తే శత్రు పీడ పోతుంది.

తొమ్మిదవ రోజు: తొమ్మిదవరోజు మహిషాసుర మర్ధిని అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మను పూజిస్తే మదిలో ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి.

click me!