నవరాత్రుల్లో ఇంట్లో ఆడపిల్ల పుడితే మీకన్నీ శుభాలే..!

First Published | Oct 19, 2023, 10:36 AM IST

navratri 2023: నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గమాత తొమ్మిది రూపాలను పూజిస్తారు. అయితే నవరాత్రుల ఈ శుభసందర్భంలో ఇంట్లో అబ్బాయి లేదా అమ్మాయి పుడితే ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. 
 

navratri 2023: హిందూ మతంలో అమ్మాయిలను దేవతలకు ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే నవరాత్రుల్లో 9 రోజుల పాటు పూజ నియమం కూడా ఉంటుంది. అయితే నవరాత్రుల్లో ఇంట్లో ఆడపిల్ల పుడితే.. ఎంతో శుభ సంకేతంగా పరిగణించబడుతుంది.
 

navratri 2023 skandmata

ఈ ఏడాది అక్టోబర్ 15న అంటే ఆదివారం నుంచి శారదా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో జన్మించిన అమ్మాయిలు తమ కుటుంబానికి అదృష్టవంతులవుతారని పండితులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 


ఇలాంటి అమ్మాయిలు అదృష్టాన్ని తెచ్చిపెడతారు

నవరాత్రులలో అబ్బాయిలు, అమ్మాయిలు జన్మించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ సమయంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులు మాత్రమే కాదు.. కుటుంబం మొత్తానికి అదృష్టాన్ని తీసుకొస్తారని నమ్ముతారు. కానీ నవరాత్రులు శక్తి దేవికి అంకితం చేయబడినందున నవరాత్రుల పవిత్ర సమయంలో ఆడపిల్లలు జన్మించడం మరింత పవిత్రంగా భావిస్తారు.
 

నవరాత్రుల్లో జన్మించిన అమ్మాయిలను పుట్టుకతోనే తెలివైనవారిగా భావిస్తారు. ఈ అమ్మాయిలు ప్రతి రంగంలోనూ విజయం తప్పకుండా సాధిస్తారు. ఈ అమ్మాయిలు ఎంతో ధార్మిక స్వభావం కలిగి ఉంటారట. అందుకే వీరు ఎక్కువగా ఆరాధనలో నిమగ్నమై ఉంటారు.
 

నవరాత్రుల్లో ఏ రోజైనా ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆ కుటుంబానికి అదృష్టం కలగడమే కాకుండా సమాజంలో వారి గౌరవాన్ని కూడా పెంచుతుందని నమ్ముతారు. అందుకే నవరాత్రుల్లో పుట్టిన బిడ్డను దుర్గమాత ఆశీర్వాదంగా భావించాలి.

Latest Videos

click me!