నవరాత్రుల్లో ఐదో రోజు ఈ కథను వింటే శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయి

First Published Oct 19, 2023, 9:45 AM IST

navratri 2023: పార్వతీదేవిని పూజించడం వల్ల మోక్షం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆమె కృప ఉంటే మరణం తర్వాత స్వర్గానికి వెళతారని నమ్ముతారు. స్కందమాత తన భక్తుల దుఃఖాలన్నిటినీ జయించి వారికి సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది.
 

శారదా నవరాత్రులలో ఐదో రోజున స్కందమాతను పూజిస్తారు. ఈ రోజు భక్తులు ఆమెకు భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉండి నిష్టగా పూజిస్తారు. స్కందమాత మహిమ గురించి శివ పురాణంలో వివరంగా చెప్పబడింది. పార్వతీదేవిని పూజించడం వల్ల భక్తుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే మోక్షాన్ని పొందుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు కూడా స్కందమాత అనుగ్రహం పొందాలనుకుంటే నవరాత్రులలో ఐదో రోజున స్కందమాతను ఆరాధించండి. అలాగే పూజ సమయంలో ఈ వ్రత కథను చదవండి.
 

కథ

ప్రాచీన కాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడని సనాతన గ్రంథాల్లో ఉంది. ఆయనొక బ్రహ్మ భక్తుడు. ఒకసారి తారకాసురుని మదిలో అమరుడు కావాలనే ఆలోచన వచ్చింది.దీంతో అతను బ్రహ్మదేవుడి కోసం కఠిన తపస్సును చేయాలని నిర్ణయించుకున్నాడు. కాలక్రమేణా తారకాసురుడు బ్రహ్మదేవుడి కోసం కఠినమైన తపస్సును చేశాడు. దీంతో బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి.. తారకాసురుడి ముందు ప్రత్యక్షమవుతాడు. నీకేం వరం కావాలో అడుగు అని తారకాసురుడిని అడుగుతారు. 
 

వెంటనే కళ్లు తెరిచిన తారకాసురుడు బ్రహ్మదేవుడిని చూసి ఎంతో సంతోషిస్తాడు. ఆ వెంటనే బ్రహ్మదేవుడికి నమస్కరిస్తాడు. ఆ తర్వాత తారకాసురుడు బ్రహ్మను అమరత్వం ప్రసాదించమని కోరుతాడు. అది విన్న బ్రహ్మదేవుడు కొన్ని క్షణాలు మౌనంగా ఉంటాడు. అప్పుడు తారకాసురుడు ఇలా అంటాడు..  స్వామీ! ఏం జరిగింది? ఎందుకు మౌనంగా ఉన్నారు?
 

దానికి బ్రహ్మదేవుడు ఇలా అంటారు. -తారకాసురా.. జన్మించిన ప్రతి వ్యక్తి మరణించడం ఖాయమన్న సంగతి మీకు తెలుసు. అందుకే నేను నీకు అమరత్వపు వరాన్ని ఇవ్వలేను. కాబట్టి ఇంకొక వరాన్ని అడగండి అని చెప్తాడు. దీంతో తారకాసుడురు దీర్ఘంగా ఆలోచిచిస్తాడు. పరమేశ్వరుడు ఒక యోగి అనే ఆలోచన తారకాసుడి మదిలో మెదిలింది.
 

సతీదేవి విడిపోవడంలో వారు ఇకపై పునర్వివాహం చేసుకోరు. అందుకే తన కుమారుని చేతిలో మరణ వరాన్ని కోరుతున్నాను. ఈ వరం కూడా అమరత్వానికి సమానమైనది. ఆ సమయంలో తారకాసురుడు శివుని కుమారుడైన కార్గికేయుడి చేతిలో మరణించే వరం కోరాడు. సింపుల్ గా చెప్పాలంటే శివుని కొడుకు తప్ప తారకాసుడిని మరెవ్వరూ చంపలేరు. ఈ వరానికి బ్రహ్మదేవుడు  తథాస్తు అంటాడు. 
 

=

అయితే ఆఆ తర్వాత తారకాసురుడి భయం ముల్లోకాలకు వ్యాపించింది. స్వర్గ దేవతలందరూ ఎంతో భయాందోళనకు గురయ్యారు. ఈ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి తారకాసురుని నుంచి మోక్షం పొందాలని ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుని ఆశ్రయానికి వెళ్లామని సలహానిస్తారు. దేవతల అభ్యర్థన మేరకు శివుడు పార్వతీమాతను వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత దేవతల సేనాధిపతి అయిన స్కందుడు అవతారం ధరించాడు. అందుకే పార్వతీమాతను స్కందమాత అంటారు. కార్తికేయుడు తారకాసురుడిని సంహరించాడు.
 

click me!