శరన్నవరాత్రులు 2023: కొబ్బరికాయ, తమలపాకు ఏ దేవుడి రూపాలు.. నవరాత్రి పూజలో వీటిని పూజించడం వల్ల ఏమౌతుందో తెలుసా

First Published Oct 13, 2023, 10:24 AM IST

navratri 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. నవరాత్రులు ప్రతి సంవత్సరం అశ్విని మాసం శుక్ల ప్రతిపాద తిథి నాడు ప్రారంభమవుతాయి. కాగా ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ 15వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రులలో తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. ఇలా చేయడం వల్ల భక్తుల బాధలన్నీ పోయి.. ఆమె ఆశీస్సులు పొందుతారని నమ్మకం. 
 

navratri 2023: నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. అలాగే నిష్టగా ఉపవాసం ఉంటారు. ఇలా చేయడం వల్ల భక్తుల బాధలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అయితే ఈ నవరాత్రుల్లో కొబ్బరికాయ, తమలపాకులను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అసలు ఈ నవరాత్రల్లో కొబ్బరికాయను, తమలపాకులను ఎందుకు పూజిస్తారో తెలుసా? 
 

అందుకే వీటిని వాడుతారు 

నవరాత్రి పూజలో ఎన్నో వస్తులను ఉపయోగిస్తారు. వేటికవే వాటి ఇవి వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మీకు తెలుసా? పూజలో ఉపయోగించే తమలపాకును వినాయకుడికి చిహ్నంగా భావిస్తారు. అలాగే కొబ్బరికాయను లక్ష్మీదేవికి రూపంగా భావిస్తారు. నవరాత్రుల ఆరాధనలో ఈ రెండింటిని ఉపయోగిస్తే ఎలాంటి ఆటంకం లేకుండా పూజ సజావుగా పూర్తవుతుందని పూజారులు చెబుతున్నారు. 
 

నవరాత్రి పూజలో తమలపాకు ప్రాముఖ్యత

నవరాత్రిలో పూజ పూర్తయిన తర్వాత తమలపాకును మీ వద్ద ఉంచుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారని నమ్ముతారు. అవును పూజలో ఉంచిన తమలపాకు వల్ల మీకు డబ్బు కొరత ఉండనే ఉండదు. అలాగే నవరాత్రుల ఆరాధనలో ఉంచి తమలపాకును డబ్బులన్న చోట పెట్టాలని చెబుతున్నారు. దీనివల్ల మీ సిరిసంపదలు పెరగడంతో పాటుగా మీ ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయి. 
 

Navratri 2023 kalash sthapna

కొబ్బరికాయ వల్ల కలిగే ప్రయోజనాలు 

నవరాత్రి పూజలో ఏకాక్షి కొబ్బరికాయను ఉపయోగించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీన్నే శ్రీఫలం అని కూడా అంటారు. కొబ్బరికాయను పూజించే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అలాగే నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు ఒక్క కొబ్బరికాయను పెడతారు. ఇలా పూజించడం వల్ల మీ జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయని నమ్మకం. 

click me!