డ్రీమ్ సైన్స్ కు హిందూమతంలో ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే మనకు పడే కలలు మన భవిష్యత్తుతో ముడిపడి ఉంటాయని నమ్ముతారు. ఇవి మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తాయని విశ్వసిస్తారు. చాలా మంది కలలో ఎన్నో సార్లు శివలింగాన్ని చూస్తుంటారు. ఇలాంటి కల పడిన తర్వాత అసలు శివలింగం కలలో కనిపిస్తే ఏం అర్థమొస్తుందని చాలా మంది మదిలో ఎన్నో ప్రశ్నలు తలెత్తులాయి. పండితుల ప్రకారం.. కలలో శివ లింగాన్ని చూడటం సంతోషించదగ్గ విషయం. అవును ఈ కల మీకు ఎంతో శుభదాయకమని అంటున్నారు. మరి శివలింగాన్ని కలలో చూస్తే ఏమౌంతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కలలో శివలింగాన్ని చూస్తే
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మీరు కలలో శివలింగాన్ని చూసారంటే మీరు ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈ కల మీరు చేపట్టిన పనిలో విజయం సాధించబోతున్నారని సూచిస్తుంది. అంతేకాదు ఈ కల మీకున్న అన్ని కష్టాలు తొలగిపోతాయని కూడా సూచిస్తుంది. ఈ కల చాలా చాలా శుభదాయకం. కాగా మీరు ఎప్పుడూ కలలో శివలింగాన్ని చూస్తున్నట్టైతే శివుడి అనుగ్రహం పొందబోతున్నారని అర్థం వస్తుంది.
కలలు పూర్వజన్మతో ముడిపడి ఉంటాయి
కలలో శివలింగం కనిపించడం శుభదాయకమంటారు పండితులు. అయితే ఇది మీ పూర్వజన్మకు సంబంధించినది కూడా కావొచ్చంటున్నారు పండితులు. కలలో శివుడు కనిపించాడటంలే మీరు చేసిన చెడు పనులకు శిక్షించబడ్డారని కూడా ఈ కల సూచిస్తుందని ఒక మత విశ్వాసం కూడా ఉంది. ఇప్పటితో మీ చెడ్డ రోజులు ముసిపోయాయి. అలాగే ఇప్పటి నుంచి మీకు అదృష్టం కలగబోతుందని నమ్ముతారు.
కలలో శివలింగం కనిపిస్తే ఈ పని చేయండి
డ్రీమ్ సైన్స్ ప్రకారం.. కలలో శివలింగం కనిపిస్తే ముందుగా మీరు మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయానికి వెళ్లండి. ఆ తర్వాత భోళాశంకరుడిని నిష్టగా పూజించండి. అలాగే శివుని పంచాక్షర స్తోత్రాన్ని పఠించండి. లేదా మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే మీ కలల శుభ ఫలితం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.