navratri 2023: నవరాత్రుల సమయంలో కలశ స్థాపనలో చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..!

First Published | Oct 15, 2023, 9:48 AM IST

navratri 2023: నవరాత్రులు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఈ రోజు ఇంట్లో కలశాన్నిప్రతిస్థిస్తారు. దీంతో ఇంట్లో ఎలాంటి సమస్యలు రావని నమ్ముతారు. అలాగే దుర్గామాత ఆశీస్సులు కూడా పొందుతారని నమ్మకం. అయితే ఈ సమయంలో కొన్ని పనులను చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
 

navratri 2023: చంద్రమాన మాసంలో మొదటిరోజు అశ్విని పదవ రోజు వరకు సాగే శార్దియ నవరాత్రుల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ పండుగను భక్తీ శ్రద్దలతో జరుపుకుంటారు. దుర్గామాతను నిష్టగా పూజిస్తారు. అంతేకాదు దుర్గామాతకు ఉపవాసం కూడా ఉంటారు. ఈ పండుగను ఉత్తర, తూర్పు భారతదేశంలో జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకోవడం వెనుక ఎన్నో కథలను చెప్పుకుంటారు. దుర్గాదేవి రక్షాస రాజు మహిషాసురుడితో వరుసగా తొమ్మిది రోజులు యుద్దం చేసి అతన్ని సంహరిస్తుంది. నవరాత్రుల్లో పదవ రోజును విజయదశమి అంటారు. నవరాత్రుల్లో దుర్గామాతను తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. 
 

అయితే నవరాత్రుల్లో కలశ స్థాపన చేస్తుంటారు. ఈ కలశాన్ని పూజగదిలో ప్రతిష్టిస్తారు. దుర్గామాత ఆశీస్సులు పొందాలంటే కలశ స్థాపన చేసేటప్పుడు కొన్ని పనులను చేయకూడదు. అలాగే మరికొన్ని పనులను ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Latest Videos


పూజా స్థలం: కలశ స్థాపన జరిగే స్థలాన్ని సరిగ్గా శుభ్రపరచాలి. దేవుడి గుడిలో కలశాన్ని పెడితే ఆ స్థలాన్ని మీరు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. 

శుభ ముహూర్తం: శుభ ఫలితాలను పొందడానికి, దుర్గామాత ఆశీస్సులు పొందడానికి మీరు కలశ స్థాపన శుభ ముహూర్తంలోనే  జరగాలి.
 

తగిన కలశం: కలశ స్థాపనకు మట్టి, రాగి లేదా వెండి కలశాన్ని ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు. కాకపోతే ఇవి వంగడం, పగిలిపోయి ఉండకూడదు. 

సరైన దిశ: కలశాన్ని రాబోయే తొమ్మిది రోజుల  పాటు ఎవ్వరూ తాగకుండా చూసుకోవాలి. అలాగే కలశం ఉత్తరం లేదా తూర్పు దిశలకు ఎదురుగా మాత్రమే ఉండాలి.

Navratri 2023 Kalash Sthapana Muhurat

ఈ వస్తువులతో కలశాన్ని అలంకరించండి: మామిడి ఆకులను, ఎరుపు వస్త్రాన్ని శుభప్రదంగా భావిస్తారు. అందుకే వీటితోనే కలశాన్ని అలంకరించండి.

click me!