Navratri: హిందువులు పవిత్రంగా పూజించే పండుగ విజయదశమి. విజయదశమి రోజున అమ్మవారిని పూజిస్తే సకల పాపపుణ్యాలు తొలగిపోతాయి. ఇక ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి నుంచి అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి.
Navratri: హిందువులు పవిత్రంగా పూజించే పండుగ విజయదశమి. విజయదశమి రోజున అమ్మవారిని పూజిస్తే సకల పాపపుణ్యాలు తొలగిపోతాయి. ఇక ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శుద్ధ పాడ్యమి నుంచి అమ్మవారి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఆ రోజు నుంచి అమ్మవారిని తొమ్మిది అవతారాలతో పూజలు చేస్తారు. ఆ తొమ్మిది రోజులు అమ్మవారికి నిష్టగా పూజలు చేసి అమ్మవారి దయ అందుకుంటారు. ఇక దశమిరోజు విజయదశమి గా అమ్మవారిని పూజిస్తారు. ఇక ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇక ఏ రోజు ఏ అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం.
211
మొదటి రోజు అమ్మవారు శైలి పుత్ర అవతారంలో దర్శనమిస్తుంది. ఈ అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. శ్రీశైలం సాంప్రదాయం ప్రకారం సాంబారు అన్నం, మినప వడలు, రవ్వ కేసరి, పానకం అమ్మవారికి సమర్పిస్తారు.
311
రెండవ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తుంది. ఆరోజు అమ్మవారికి ఇష్టమైన పులిహోర నైవేద్యంగా పెట్టి ఆమె ఆశీర్వాదాలు పొందుతారు.
411
మూడవరోజు అమ్మవారు చంద్రఘంటా అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఆ రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం, పాయసం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలి.
511
నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారం లో దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృప లు అందుకోవాలి.
611
అయిదవ రోజు అమ్మవారు లలితా దేవి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు అందుకోవాలి.
711
ఆరవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.
811
ఏడవ రోజు అమ్మవారు జగన్మాత సరస్వతీ రూపంలో దర్శనమిస్తుంది. ఇక ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం, అల్లం గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు.
911
ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారం లో దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు.
1011
తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్ధిని అమ్మవారి గా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి రవ్వతో చేసిన చక్కెర పొంగలిను నైవేద్యంగా సమర్పిస్తారు.
1111
ఇక చివరి రోజైన విజయదశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి గా దర్శనమిస్తుంది. ఈ రోజు అమ్మవారికి సేమియా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరి అన్నం, పరమాన్నం నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృప అందుకుంటారు.