దీపావళి రోజు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

First Published Nov 3, 2021, 3:19 PM IST

హిందువులు జరుపుకునే పండగలలో దీపావళి (Diwali) పండగ ముఖ్యమైనది. దీపావళి రోజు భక్తులంతా భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అమ్మవారిని పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు. అంతేకాకుండా ఇళ్లంతా దీపాలతో నింపుతారు. ఇక పెద్దవాళ్లు, చిన్న వాళ్లు అనే తేడా లేకుండా అందరూ బాణాసంచాలు కాలుస్తారు. ఇక ఎంతో వెలుగులతో నిండి ఉండే ఈ దీపావళి రోజు కొన్ని జాగ్రత్తలు (Precautions) తీసుకోవాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
 

అదేంటి ఈ పండగ రోజు జాగ్రత్తలు ఏంటి అని అనుకుంటున్నారా.. అవును ఈ పండుగ రోజు దీపాలతో (lights), టపాసులతో (Tapas) జాగ్రత్తగా ఉండాలి. ఇల్లులు, వీధులు దీపాలతో నిండి ఉంటాయి. కాబట్టి దీపాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ధరించిన దుస్తులను జాగ్రత్తగా చూసుకోవాలి. దీపాలను వెలిగిస్తున్న సమయంలో ఎటు వైపు చూడకుండా శ్రద్ధతో వెలిగించాలి.
 

దీపాలు పెడుతున్న సమయంలో ఎటువంటి రసాయనిక (Chemical) పదార్థాలను చేతులకు అంటించుకోకూడదు. లేదంటే చేతులు కాలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీపాలు (Deepam) పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.
 

ఒకప్పుడు చిన్న చిన్న టపాసులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం పెద్దపెద్ద శబ్దాలతో మోగే పెద్దపెద్ద టపాసులను తయారు చేస్తున్నారు. దీంతో టపాసులను  కొనుగోలు చేసుకునే ప్రజలు పెద్దపెద్ద శబ్దాలను (Sounds) వచ్చే వాటిని మాత్రమే తీసుకుంటున్నారు. వీటిని ప్రజలు ఉండే చోట్లలో, ఇళ్ల మధ్యలలో కాల్చడం వల్ల ప్రమాదాలు (Accident) జరిగే అవకాశం ఉంది.
 

ముఖ్యంగా పెద్ద పెద్ద శబ్దాల వల్ల ఇంటి చుట్టు ఉన్న పెద్దవాళ్ళు, చిన్న వాళ్ళు భయపడే (Fearful) సందర్భాలు కూడా ఉంటాయి. దీనివల్ల వారి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలా పెద్ద పెద్ద టపాసులనే (Tapas) లనే కాకుండా చిన్న చిన్న టపాసులు కూడా ప్రజలు ఉన్నచోట కాలువకూడదు.
 

పొరపాటున టపాసులు వచ్చి మీద పడే పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు ఈ టపాసుల వేడుకల్లో పందెం (Bet) వంటివి కూడా కట్టుకుంటారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి. మరికొందరు టపాసులను చేతిలో పట్టుకొని మరి కాల్చుతారు. ఇలా కాల్చడం వల్ల చేతులకు గాయాలు (Injuries) అవుతాయి.
 

 ఇక అందరూ పండగ రోజు కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు. కాబట్టి టపాసులు కాల్చేటప్పుడు కొత్త బట్టలను (Dress) కాకుండా వదులుగా ఉండే కాటన్ బట్టలు ధరించడం చాలా వరకు మంచిది. ఏవైనా వాహనాలు (Vehicles) ఉన్నచోట టపాసులను అసలే కాల్చకూడదు. పొరపాటున వాటిపై మంటలు పడితే తీవ్రమైన నష్టం జరుగుతుంది.
 

కొందరు మద్యం (Alcohol) సేవించి కూడా టపాసులు కాలుస్తూ ఉంటారు. వారు మతిస్థిమితం (Insane) లేకుండా టపాసులు కాల్చడం వల్ల తప్పకుండా ప్రమాదాలు జరుగుతాయి.  కాబట్టి ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలి అంటే శ్రద్ధగా, ఇంటికి దూరంగా, ప్రజలు లేని చోట టపాసులు కాల్చుకోవాలి.

click me!