దీపావళి రోజు ఏ నూనెతో దీపాలు వెలిగించాలి.. ఎలాంటి ఆచారాలు పాటించాలి?

First Published | Nov 3, 2021, 12:21 PM IST

ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య (Ashvayuja Amavasya) రోజు దీపావళి పండుగ వస్తుంది. ఈ పండుగను హిందువులు జరుపుకుంటారు. పండుగ రోజు భక్తులంతా ఉదయాన్నే లేచి, ఇంటిని శుభ్రం చేసుకొని, తాము స్నానాలు ఆచరించి లక్ష్మీ (Laksmi) అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఇక ఈ రోజు ఇంటి నిండా దీపాలతో అద్భుతంగా అలంకరిస్తారు.
 

ఇక ఈ దీపావళి రోజు పూజలు చేసే సమయంలో కొన్ని కొన్ని పద్ధతులు (Methods) ఉంటాయి. ముఖ్యంగా ఏ పండుగ నైనా చేసుకుంటున్నప్పుడు.. ఆ దేవుడికి నచ్చిన విధంగా పూజలు చేసి ఆ దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తారు. అలా అందరి దేవుళ్లకు ఒకేలా ఉండవు. ఒకే రకమైన నైవేద్యాలు కూడా ఉండవు. దాంతో భక్తులు తాము పూజ చేసే సమయాలలో తెలిసి తెలియని పొరపాట్లు (Mistakes) చేస్తుంటారు.
 

దీనివల్ల వాళ్ళు దేవుళ్లకు చేసిన పూజ ఫలితం లేకుండా పోతుంది. ముఖ్యంగా దీపావళి (Diwali)రోజు భక్తులు చాలా రకాల సందేహాలతో ఉంటారు. అందులో ముఖ్యంగా ఏ నూనెతో దీపం పెట్టాలి అని ఏ వైపు దీపం పెట్టాలి అని బాగా సందేహాలతో ఉంటారు. కాబట్టి దీపావళి రోజున ఏ నూనెతో (Oil) ఎన్ని దీపాలు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 


ప్రతిరోజు ఇంట్లో పూజలు చేస్తున్న సమయంలో భక్తులంతా నెయ్యి లేదా ఆవనూనెతో దీపాలు వెలిగిస్తారు. ఇక దీపావళి రోజు కూడా చాలామంది ఈ నూనెతోనే దీపాలు (Deepam) పెడతారు. కానీ దీపావళి రోజు మరొక నూనె తో కూడా దీపాలు వెలిగిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని కొన్ని శాస్త్రాలు (Sciences) చెబుతున్నాయి.
 

ఇంతకీ ఆ నూనె ఏదో కాదు అవిసె నూనె (Flax Oil). ఈ నూనె బయట మార్కెట్లో స్వచ్ఛమైనదిగా దొరుకుతుంది. కాబట్టి ఈ నూనెను దీపావళి రోజు దీపాలను వెలిగించడానికి ఉపయోగించుకోవాలి. ఈ నూనెతో దీపం పెట్టడం వల్ల రాహు, కేతువుల (Rahu, Ketuvula) అరిష్ట దృష్టి నశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక దీపావళి రోజు ఈ నూనెతో ఎన్ని దీపాలు వెలిగించాలో ఓ సారి చూద్దాం.
 

దీపావళి రోజు భక్తులంతా తమ ఇంట్లో పదమూడు దీపాలను (13 Lightings) వెలిగించాలని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఇలా వెలిగించడం వల్ల అంత మంచే జరుగుతుందని ఒక నమ్మకం. ముఖ్యంగా తూర్పు వైపున దీపాన్ని వెలిగించడం వల్ల  ఆయుష్షు (Ayush) పెరుగుతుంది. ఇక ధన్ తేరాస్ రోజు మొదటి దీపాన్ని దక్షిణం వైపు పెట్టాలి.
 

దీపావళి రోజు రెండవ దీపాన్ని గుడిలో ఆవు నెయ్యితో (Ghee) పెట్టాలి. మూడవ దీపాన్ని దీపావళి రోజు ఆకాశంలో చుక్కలు వచ్చిన సమయాన లక్ష్మీ దేవి ఎదుట పెట్టాలి. అదే సమయాన తులసి (Tulasi) కోట దగ్గర నాలుగవ దీపాన్ని పెట్టాలి. ఇంటి గుమ్మం బయట ఐదవ దీపం వెలిగించాలి. ఆరవ దీపం రావి చెట్టుకింద వెలిగించాలి.
 

ఏడవ దీపాన్ని ఇంట్లో పూజగది లో పెట్టాలి. ఎనిమిదవ దీపాన్ని ఇంటిదగ్గర చెత్త కుప్ప వద్ద వెలిగించుకోవాలి. బాత్రూం లో తొమ్మిదవ దీపాన్ని వెలిగించాలి. పదవ దీపాన్ని దాని కప్పుపై వెలిగించాలి. కిటికీ దగ్గర పదకొండవ దీపాన్ని, ఇంటి పై కప్పు పైన పన్నెండవ దీపాన్ని పెట్టాలి. పదమూడవ దీపాన్ని ఇంటి వద్ద కూడలిలో వెలిగించుకోవాలి. ఇలా 13 దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో చెడు దృష్టి (Bad vision) తొలిగి అంతా మంచి జరుగుతుందని ఒక నమ్మకం (Believe).

Latest Videos

click me!