పండగ రోజున ఇంట్లో అందాల రంగవల్లి దిద్దుంటే.. ఆ అందమే వేరు. కేవలం సంక్రాంతి పండగ రోజు మాత్రమే కాదు.. దీపావళి పండగ రోజు కూడా ఇంట్లో అ ందాల రంగవల్లులు దిద్దుకుంటారు. ఆ రంగవల్లి మధ్యలో వెలుగులు జిమ్మే దీపాలు ఉంచితే.. మరింత అందాన్ని తీసుకువస్తుంది. అంతేకాదు.. ఇంటి ముందు.. ఇంట్లో రంగవల్లులు, దీపాలతో అలంకరిస్తే.. ఆ ఇంట్లోకి లక్ష్మీ దేవి అడుగుపెడుతుందనే నమ్మకం ఎక్కువ. మరి ఈ దీపావళి రోజున మీ ఇంటికి మరింత శోభను తీసుకువచ్చే.. సింపుల్, అందమైన రంగవల్లి డిజైన్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం..