Spiritual: ముగ్గే కదా అని తొక్కేయకండి.. విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

First Published | Jul 14, 2023, 12:41 PM IST

Spiritual: నేటి కాలంలో ముగ్గులు అంటే కలర్ పెయింట్స్ తోనో లేదంటే స్టిక్కర్స్ రూపంలోనూ గుమ్మం ముందు పెడుతున్నారు. నిజానికి ముగ్గు వరి పిండితో  మాత్రమే వేయాలి. ముగ్గు యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం.
 

 నిజానికి ఒకప్పుడు వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టడంతోనే ఆడవాళ్ళ దినచర్య ప్రారంభమయ్యేది. చక్కగా ఆవు పేడతో కళ్ళకి జల్లి ముగ్గు పెడితే ఆ ఇల్లు లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ కళకళలాడేది కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి అంత సమయం ఉండటం లేదు రోజు ఎవడు పెడతాడు లే అని ఒక పెయింట్ ముగ్గు వేసేస్తున్నారు.
 

 లేదంటే ఒక రంగోలి స్టిక్కర్ తీసుకువచ్చి అతికించేస్తున్నారు నిజానికి అసలు అది ముగ్గే కాదు. వరి పిండితో వేసేది మాత్రమే ముగ్గు. నిజానికి ఇది ఒక హైందవ సాంప్రదాయం. ముగ్గులేని ఇంటికి సాధువులు బిక్షువులు దీక్షకి వెళ్లేవారు కాదట ఆ రోజుల్లో.
 


 ముగ్గు వేసి దానికి రెండు వైపులా రెండు అడ్డగీతలు గీస్తే అక్కడ మంగళకరమైన కార్యం ఏదో జరుగుతుందని అర్థం అలా గీతలు గీయకపోతే దుష్టశక్తులు ఆ ఇంట ప్రవేశిస్తాయని లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుందని పెద్దలు చెబుతారు. ముగ్గుల వెనుక సామాజిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన రహస్యాలు అనేకం ఉన్నాయి.
 

 మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. నక్షత్రం ఆకారంలో వచ్చేలా గీసిన ముగ్గు బోధ ప్రేత పిశాచాలను నా వైపు రాకుండా నిరోధిస్తుంది ముగ్గు అంటే దేవతలకు మానవుని పలికే ఆహ్వానం అందుకే ముగ్గుని తొక్కకూడదు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ..

అమ్మవారు, శ్రీమహావిష్ణువు ముందు నిత్యం మనోజ్ఞమైన ముగ్గు వేస్తుందో ఆమెకు ఏడు జన్మల వరకు వైధర్యం రాదని సమంగలుగానే జీవిస్తుందని దేవి భాగవతం చెప్తుంది. అలాగే శాస్త్రం ఏ ముగ్గు ఎక్కడ వేయాలో కూడా చెప్తుంది నూతన వధూవరులు తొలిసారి ఈ భోజనం చేసే సమయంలో అతను పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.
 

శివాలయంలో ఎనిమిది పలకల ముగ్గులు అష్ట లింగ ముగ్గు వేస్తారు అమ్మవారి ఆలయంలో అష్టదళ ముగ్గులు శ్రీ చక్రాలు ముగ్గులు వేస్తారు. అందుకే ముగ్గే కదా తేలికగా తీసుకోకండి. ప్రతి ముగ్గులోని మనకు తెలియని దేవతాచక్రాలు ఉంటాయని గుర్తించండి.

Latest Videos

click me!