సాధారణంగా ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని విషయాలలో రాజీ పడకూడదు. వాస్తు శాస్త్రానికి సంబంధించి అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఉండకపోతే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు కరువైపోతాయి. అలాగే బంధాలు కూడా దూరమైపోయే అవకాశం ఉంది.
అందుకే ఇల్లు కట్టుకునేటప్పుడు ఇంట్లో ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉంచడం లేదా వేయడం వంటివి చేయకూడదు. అలాగే పైప్ లైన్ నైరుతి నుంచి బయటకు వెళ్లకుండా చూడాలి. మీ ఇంట్లో నుంచి వెళ్లే నీరు తూర్పు లేదా ఉత్తరం దిశల నుంచి బయటికి వెళ్లడం ఉత్తమం.
పడమట వైపు నుంచి కానీ దక్షిణ వైపు నుంచి గాని అసలు బయటికి వెళ్ళకూడదు. ఇల్లు కట్టుకునే సమయంలో కచ్చితంగా వాస్తు శాస్త్ర నిపుణుడిని, ఇంజనీర్ యొక్క సలహాలని తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇల్లు నిర్మించుకోవడం అనేది జీవితంలో ఒకటి రెండు సార్లు మాత్రమే జరుగుతుంది.
అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంటి చుట్టూ ఉండే ప్రహరీ గోడకు కాంపౌండ్ వాల్ ను టచ్ చేస్తూ ఎలాంటి కట్టడాలు చేయకూడదు. ముఖ్యంగా మెట్లను ప్రహరీ గోడకు టచ్ చేస్తూ కట్టకూడదు. కొందరు ఇంటి గోడకి ఆనుకొని బాత్రూం లేదా పనివారికి చిన్న రూమ్ వంటివి నిర్మిస్తారు.అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం అసలు మంచిది కాదు.
అలాగే ఈశాన్యం గదిలో దంపతులకు బెడ్ రూమ్ అసలు ఉండకూడదు. తల్లిదండ్రులను ఎప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంచాలి. పెద్ద కొడుకు మొదటి అంతస్తులో, రెండో కొడుకు రెండు అంతస్తులో మూడో కొడుకు మూడో అంతస్తులో ఉండాలి. అలాగే ఇంటి నిర్మాణం జరుగుతున్నప్పుడు అటువైపుగా ఆవులు గాని దూడలు గాని వచ్చినట్లయితే వాటికి గ్రాసం, తాగడానికి నీళ్లు ఏర్పాట్లు చేస్తే మంచిది.
గోవులు మూత్రం, పేడ వేసే వరకు అక్కడే ఉంచుకోవడం మరీ మంచిది. ఇంటి నిర్మాణం ఎప్పుడూ చైత్రం, జేష్టం, ఆషాడం, మార్గశిరం, పుష్య మాసాలలో ప్రారంభించకూడదు. ఇలా చేయడం వలన ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాగే ఇంటికి ఒకే దిక్కున మూడు ద్వారాలు ఉండకుండా జాగ్రత్త పడండి.