దురదృష్టం పోవాలంటే అమావాస్య రోజు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే..!

First Published | Sep 15, 2023, 9:59 AM IST

హిందూమతంలో ఎన్నో ముఖ్యమైన రోజుల్లో అమావాస్య ఒకటి. ఈ రోజున ఆకాశంలో చుంద్రుడు కనిపించదు. అమావాస్య అంటే పితృదేవతలను గౌరవించే రోజు. ఈ రోజున కొన్ని పనులను అసలే చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

చంద్రుడు కనిపించని రోజునే మనం అమావాస్య అంటాం. అయితే ఈ రోజును ప్రతికూల శక్తుల రోజుగా కూడా పరిగణిస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఈ రోజున తమ పూర్వీకులకు పూజ చేయాలి. దీని వల్ల ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుందని నమ్ముతారు. అలాగే ఈ రోజున ఇంటిని స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుతాయి. జ్యోతిష్యశాస్త్రంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే భారతదేశంలో జన్మాష్టమి నుంచి దీపావళి వరకు ఎన్నో ముఖ్యమైన పండుగలను మనం అమావాస్య రోజునే జరుపుకుంటాం. ఇక ఈ రోజు ప్రతికూల శక్తి పోవాలని చాలా మంది ఎన్నో పద్దతులను కూడా పాటిస్తుంటారు. మరి అమావాస్య నాడు దురదృష్టం పోవడానికి చేయాల్సిన, చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అమావాస్య నాడు చీపురును కొనడం అస్సలు మంచిది కాదు. దీన్ని కొనడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీంతో మీ ఇంట్లో డబ్బుకు కొదవ వస్తుంది. అలాగే ఇంట్లో చెడు ప్రభావం ఉంటుంది. అంతేకాదు మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 


అమావాస్య నాడు తులసి లేదా మారెడు ఆకులను అస్సలు తెంపకూడదు. ఒకరోజు మీరు దేవుడికి సమర్పించాలనుకుంటే అమావాస్యకు ముందు రోజే కోయండి. 

అమావాస్య నాడు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. అసలు దీన్ని ముట్టుకోనేవద్దు. ఈ రోజు మందు తాగడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల ప్రభావం ఉంటుంది. అంతేకాదు కుటుంబం కూడా ప్రభావితం అవుతుంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అమావాస్య నాడు రావిచెట్టు కింది దీపం వెళిగించాలి. అలాగే దేవతలను, పూర్వీకులను పూజించాలి. దీనివల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. 
 

అమావాస్య నాడు ఆహార ధాన్యాలను కొనడం, పెళ్లి వేడుకులను చేసుకోవడం, పూజా సామాగ్రిని కొనడం, మాంసం తినడం అస్సలు మంచిది కాదు. అలాగే ఈ రోజు ఎలాంటి శుభకార్యాల్లో పాల్గొనకూడదు. అంతేకాదు వ్యాపారానికి సంబంధించిన పెద్ద పెద్ద లావాదేవీలను చేయకూడదు. అలాగే కొత్త వెంచర్లను ప్రారంభించకూడదు. 

పితృదేవతలకు ఈ రోజు అంకితం చేయబడింది కాబట్టి చనిపోయిన కుటుంబ సభ్యులను పూజించండి. వారి ఆశీస్సులు పొందడానికి ఈ రోజు పితృపూజ కూడా చేయొచ్చు. 
 

ఇకపోతే అమావాస్య నాడు శ్మశానవాటికలు వంటి చీకటి, నిర్మానుశ్య ప్రదేశాలకు వెళ్లకూడదు. ఎందుకంటే అమావాస్య రోజున దుష్ట శక్తులు పనిచేస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

శాస్త్రాల ప్రకారం.. ప్రతి అమావాస్య రోజున మన పూర్వీకులు తమ ఇండ్లకు సందర్శిస్తారట. అందుకే ఈ రోజున దానధర్మాలు చేయాలని జ్యోతిష్యులు చెబుతారు. 

ప్రతి అమావాస్య నాడు ఆవుకు 5 రకాల పండ్లను, గోధుమ ఉండలను పెట్టండి. దీనివల్ల మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. 
 

Latest Videos

click me!