సఫల ఏకాదశి నాడు వీటిని దానం చేయండి.. జీవితంలో ఏ బాధలు ఉండవు

First Published | Jan 7, 2024, 9:40 AM IST

Saphala Ekadashi 2024: సనాతన ధర్మంలో ఏకాదశి తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి ప్రతి నెలా రెండుసార్లు వస్తుంటుంది. మొదటిది కృష్ణపక్షంలో, రెండోది శుక్లపక్షంలో. పుష్య మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి లోకాధిపతి అయిన విష్ణుమూర్తిని పూజిస్తే పుణ్యఫలం దక్కుతుందని చెప్తారు. 
 

Saphala Ekadashi 2024

2024 సంవత్సరంలో మొదటి ఏకాదశి జనవరి 07 న అంటే ఈ రోజే వస్తుంది. సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. దీనివల్ల కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతుందని నమ్ముతారు. సఫల ఏకాదశి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో సంతోషం కలుగుతుందని, విష్ణువు అనుగ్రహం లభిస్తుందని మత విశ్వాసం. సఫల ఏకాదశి సందర్భంగా దానం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
 

saphala ekadashi 2024

సఫల ఏకాదశి నాడు బెల్లం దానం చేయాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు బెల్లాన్ని దానం చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.

ఈ రోజున పేదలకు వెచ్చని దుస్తులను దానం చేయడం కూడా మంచిది. ఈ దానం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
 


saphala ekadashi 2024

ఏకాదశి సందర్భంగా అన్నదానం కూడా చాలా మంది చేస్తుంటారు. లోకాధిపతి అయిన విష్ణుమూర్తి సఫల ఏకాదశి రోజున అన్నదానం చేసి సంతోషిస్తారట. ఈ రోజున బియ్యం, మొక్కజొన్న ధాన్యాలను కూడా దానం చేస్తారు. 
 

సఫల ఏకాదశి నాడు పసుపు రంగు వస్త్రాలను కూడా దానం చేయొచ్చు. దీనివల్ల విష్ణువు అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో బృహస్పతి బలపడతాడు.

సఫల ఏకాదశి ఉపవాసం ముగిసిన తర్వాత బ్రాహ్మణుడికి అన్నదానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 

సఫల ఏకాదశి శుభ ముహూర్తం

సఫల ఏకాదశి తిథి జనవరి 7న అర్ధరాత్రి 12.41 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే జనవరి 08న రాత్రి 10.41 గంటలకు ముగుస్తుంది. జనవరి 8న ఉదయం 7.15 గంటల నుంచి 9.20 గంటల వరకు సఫల ఏకాదశి ఉపవాస దీక్ష ఉంటుంది.

Latest Videos

click me!