2024లో మొదటి శుక్రవారం నాడు ఈ పనులు చేస్తే మీకు సంవత్సరం పొడవునా డబ్బుకు కొరత ఉండదు

First Published | Jan 5, 2024, 9:44 AM IST

హిందూ పురాణాల ప్రకారం.. శుక్రవారం సంపద దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. కొత్త సంవత్సరం అంటే 2024 ప్రారంభమైంది. కాగా ఈ రోజు ఈ ఏడాదిలో మొదటి శుక్రవారం. ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించి కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే మీకు ఈ ఏడాది మొత్తం డబ్బుకు కొదవ ఉండదు. 
 

సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదల దేవతగా భావిస్తారు. ఎందుకంటే నమ్మకాల ప్రకారం.. ఆమె అనుగ్రహం ఉంటే.. సంపదను పొందొచ్చు. కాగా సంవత్సరంలోని మొదటి శుక్రవారం నాడు మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీరు డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. 
 

సంవత్సరంలోని మొదటి శుక్రవారం అంటే ఈ రోజు మీ ఇంటి దేవుడి గుడిలో గులాబీ పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రాన్ని ప్రతిష్ఠించండి. అలాగే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పూజించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే మీకు ధన సమస్య ఉండదు. 
 


శుక్రవారం లక్ష్మీదేవిని పూజించిన తర్వాత అవసరమైన వారికి పిండిని దానం చేయండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహాన్ని  పొందుతారు. దీనితో పాటుగా శుక్రవారం నాడు పాలు, పెరుగు, కర్పూరం లేదా తెలుపు దుస్తులు మొదలైన తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.
 

శుక్రవారం లక్ష్మీదేవిని పూజించే సమయంలో గులాబీ పువ్వులు లేదా తామర పువ్వులను సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి త్వరగా సంతోషిస్తుంది. వీటితో పాటు గులాబీ పూలతో చేసిన దండను కూడా లక్ష్మీదేవికి సమర్పించొచ్చు. ఆ తర్వాత నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.
 

Latest Videos

click me!