మహాలక్ష్మీ వ్రతం నాడు ఈ పరిహారాలు చేస్తే.. మీ ఇంట్లో సంపదకు ఏ లోటూ ఉండదు

First Published | Sep 23, 2023, 2:50 PM IST

Mahalakshmi Vratam 2023: సనాతన ధర్మంలో మహాలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉంటారు. ఉపవాసం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా జీవితంలో సుఖసంతోషాలు, సంపద, శాంతి, సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. 
 

హిందూ క్యాలెండర్ ప్రకారం.. మహాలక్ష్మి వ్రతం ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షంలోని ఎనిమిదో రోజున ప్రారంభమవుతుంది. ఈ ఉపవాసం అశ్విని మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజు వరకు కొనసాగుతుంది. ఈ ఉపవాసాన్ని ప్రతి ఏడాది 16 రోజులు ఉంటారు. ఈ ఏడాది మహాలక్ష్మి వ్రతం సెప్టెంబర్ 22 న ప్రారంభమైంది. అక్టోబర్ 6 న ముగుస్తుంది. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి వరలక్ష్మీ వ్రతం నాడు ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. మహాలక్ష్మి వ్రతం సందర్భంగా మీరు 16 రోజుల పాటుగా నెయ్యి  దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. దీనివల్ల మీ దురదృష్టం పోయి అదృష్టం కలుగుతుంది. ఇకపోతే మహాలక్ష్మీ వ్రతం మొదటి రోజున లక్ష్మీదేవికి ఖీర్ సమర్పించి 16 మంది బాలికలకు పంచండి. ఇది లక్ష్మీదేవిని ఎంతో సంతోషపరుస్తుంది. అలాగే శ్రేయస్సు, సౌభాగ్యాలు కలుగుతాయి. 
 


2. మహాలక్ష్మీ వ్రతం నాడు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మహాలక్ష్మీ నమః మంత్రాన్ని జపించండి.. ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ముడి దారంలో 16 ముడులను కట్టి ప్రతి ముడిపై కుంకుమ, అక్షతలు వేయండి. దీన్ని లక్ష్మీదేవికి సమర్పించండి. పూజ పూర్తైన తర్వాత మీ కుడి చేతిలో పెట్టండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో సంపద ఎప్పుడూ నిండుకుండలా ఉంటుంది. 
 

3. మీరు ఎంత కష్టపడినా విజయం సాధించలేకపోతే మహాలక్ష్మి వ్రతంలో 16 రోజుల పాటు మహాలక్ష్మి వ్రత కథను వినండి. అలాగే ఈ సమయంలో 16 బియ్యపు గింజలను చేతిలో ఉంచుకోండి. కథ పూర్తయిన తర్వాత సాయంత్రం ఈ బియ్యాన్ని నీటిలో వేసి చంద్రుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. 
 

4. పసుపు గవ్వలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవని నమ్ముతారు. అందుకే మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపు గవ్వలను అమ్మవారికి సమర్పించండి. దీని కోసం పసుపు గవ్వలను ఎరుపు గుడ్డలో కట్టి మీరు డబ్బు ఉన్న ప్రదేశంలో లేదా సురక్షితంగా పెట్టండి. దీనివల్ల మీ డబ్బుల పెట్టె ఎప్పుడూ ఖీళీగా ఉండదని నమ్ముతారు.

Latest Videos

click me!