Ganesh Visarjan 2023
హిందూ మతంలో.. వినాయకుడి పూజకు, ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బొజ్జ గణపయ్యను, విఘ్నహర్త అని, ఖుష్కర్త అని, ఏక దంత అని, వినాయకుడు అంటూ ఎన్నో పేర్లతో పిలుస్తారు. అలాగే ఏ శుభకార్యానికైనా వినాయకుడినే ముందు పూజిస్తారు. వినాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వినాయక చవితిని ప్రతి ఏడాది పది రోజుల పాటు జరుపుకుంటాం. పది రోజుల తర్వాత వినాయక నిమజ్జనం చేస్తాం. అయితే కొంతమంది ఒకటిన్నర, మూడు, ఐదు, ఏడు రోజుల్లో కూడా వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. మరి వినాయకుడి నిమజ్జనం చేయడానికి ముందు ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమజ్జనానికి ముందు ఇలా చేయండి
వినాయక నిమజ్జనానికి ముందుగా దేవుడిని నిష్టగా పూజించండి. ఎర్రని పూలు, ఎర్రచందనం, దుర్వ, శెనగపిండి, పాన్, తమలపాకు, ధూప దీపం మొదలైన వాటిని విఘ్నేషుడికి సమర్పించండి. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ గణపయ్యకు హారతినివ్వండి. అనంత చతుర్దశి రోజున వినాయకుడు తన ఇంటికి తిరిగి వెళ్తాడని నమ్ముతారు. అందుకే వినాయకుడిని ఖాళీ చేతులతో నిమజ్జనం చేయకూడదు. కాబట్టి నిమజ్జనానికి ముందు వినాయకుడి చేతిలో లడ్డూలను పెట్టండి.
Image: Getty Images
నిమజ్జనం ఎలా చేయాలంటే?
మీరు చిన్న చిన్న మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలనుకుంటే మీ ఇంట్లో ఉండే నీటి తొట్టిలో నిమజ్జనం చేయొచ్చు. ఈ మట్టి పూర్తిగా కరిగిన తర్వాత పూల కుండల్లో నీళ్లు పోయాలి. విగ్రహం మరీ పెద్దదిగా ఉంటే నిర్ణీత ప్రదేశంలో లేదా చెరువులో నిమజ్జనం చేయొచ్చు.
నిమజ్జనం సమయంలో బొజ్జ గణపయ్యను మళ్లీ రమ్మని ప్రార్థించండి. గణేషుడి నిమజ్జనం సమయంలో పరిశుభ్రతపై కూడా మీరు శ్రద్ధ పెట్టాలి. నిమజ్జనం సమయంలో మీ మనస్సులో చెడు ఆలోచనలను రానీయకూడదు. ముఖ్యంగా నిమజ్జనం తర్వాత మందు, మాంసం జోలికి అసలే పోకూడదు. అలాగే ఈ రోజున మీరు పొరపాటున కూడా బ్లాక్ కలర్ దుస్తులను వేసుకోకూడదు.