మహాలక్ష్మీ వ్రతం 2023: పూజ సమయంలో ఈ పనులను చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతరు..

First Published | Sep 22, 2023, 12:02 PM IST

Mahalakshmi Vratam 2023: లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా కొలుస్తారు. ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్షం ఎనిమిదో రోజు మహాలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు అమ్మవారికి ఉపవాసం ఉండి.. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటారు. మరి లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడానికి ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Mahalakshmi Vratam 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. భాద్రపద మాసం శుక్లపక్షంలోని ఎనిమిదో రోజున  మహాలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది. అలాగే అశ్విని మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదో రోజు వరకు వ్రతాన్ని ఆచరిస్తారు. భక్తులు 16 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది మహాలక్ష్మీ వ్రతం సెప్టెంబర్ 22న అంటే ఈరోజే ప్రారంభం అయ్యింది. ఈ వ్రతం అక్టోబర్ 6వ తేదీ  అంటే శుక్రవారంతో ముగుస్తుంది. అయితే పూజా సమయంలో కొన్ని పనులను చేస్తే అమ్మవారి అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

1. 16 రోజుల పాటు సాగే ఈ మహాలక్ష్మి వత్రంలో ఉపవాసం ఉండి గజలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతంలో 16 రోజులు ఉపవాసం చేయలేని వారు.. ఈ మహాలక్ష్మీ వత్రం చివరిరోజున అంటే 16 వ రోజున ఉపవాసం ఉండొచ్చు. 
 


2. మహాలక్ష్మీ వ్రతం చివరి మూడు రోజుల్లో కూడా లక్ష్మీదేవికి ఉపవాసం ఉండొచ్చు. నిష్టగా ఉపవాసం ఉండి.. పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. ఇందుకోసం మీరు ఉపవాసం సమయంలో ఉదయం సూర్యోదయానికి ముందేనిద్రలేచి స్నానం చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. దీనివల్ల అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది.
 

3. మహాలక్ష్మీ వ్రతం సందర్భంగా మీరు లక్ష్మీదేవి మట్టి లేదా వెండి విగ్రహాన్ని మీ ఇంట్లో ప్రతిష్టించొచ్చు. అయితే అమ్మవారి విగ్రహం దగ్గర గాజులతో పాటుగా కొన్ని వెండి నాణేలను కూడా ఉంచాలి. దీంతో లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. మీ ఆర్థిక సమస్యలన్నింటినీ పోగొడుతుంది.

4. లక్ష్మీదేవిని పూజించే సమయంలో కుంకుమ, పసుపు, అక్షింతలు, తామరగట్టు, ఎర్ర గులాబీలను సమర్పించాలని పండితులు చెబుతున్నారు. వీటితో పాటుగా దక్షిణ శంఖం, శ్రీ యంత్రాన్ని కూడా లక్ష్మీదేవి విగ్రహం దగ్గర పెట్టాలి. 

5. లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో మీరు అమ్మవారికి కొన్ని రకాల స్వీట్లను సమర్పించాలి. ముఖ్యంగా తెల్లరంగులో ఉండే ఖీర్, గింజ స్వీట్లను సమర్పించండి. ఉపవాస సమయంలో మహాలక్ష్మి వ్రత కథను ఖచ్చితంగా పఠించండి.
 

6. ఉపవాసం చేసే సమయంలో అంటే ఉదయం పూట, సాయంత్రం పూట మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నెయ్యి దీపాలను వెలిగించండి. అలాగే ఉపవాసం మొదటి రోజు ఇంటి ప్రధాన గుమ్మం వద్ద పసుపు, కుంకుమలతో లక్ష్మీదేవి పాదముద్రలు వేయండి. అలాగే లక్ష్మీదేవి మంత్రం ఓం లక్ష్మీ నమఃను రోజుకు 108 సార్లు జపిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది.
 

Latest Videos

click me!