ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం ఏర్పడుతోంది. ఈ చంద్ర గ్రహణం భారత్ లో కూడా కనపడుతుంది. కాబట్టి… గ్రహణ ప్రభావం భారత్ పై కూడా ఉంది. మరి, ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం…
26
గ్రహణానికి దూరంగా గర్భిణీ స్త్రీలు..
గర్భిణీ స్త్రీలు నేరుగా గ్రహణానికి గురికాకూడదు. ఆ సమయంలో బయటకు వచ్చి.. గ్రహాణాన్ని చూడకపోవడమే మంచిది. గ్రహణం సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లకూడదు. ఇంటి కిటికీలు, తలుపులు కూడా మూసివేయాలి.
36
పదునైన వస్తువులు...
గ్రహణం సమయంలో గర్భిణులు పదునైన వస్తువులు వాడకూడదు. కత్తెర, కత్తి, సూది వంటివి వాడటం వలన పిల్లలకు శారీరక లోపాలు రావచ్చు. కాబట్టి.. అలాంటి వస్తువులు వాడకూడదు. వాటిని తాకకూడదు.