lunar eclipse 2023: ఈ సంవత్సరంలో రెండో చంద్రగ్రహణం అక్టోబర్ లో సంభవించబోతోంది. చంద్రగ్రహణం అక్టోబర్ 29న తెల్లవారుజామున 29.1 గంటలకు ప్రారంభమై 06.02 గంటలకు ముగుస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అందుకే సుతక్ కాలం మన దేశంలో చెల్లుబాటు అవుతుంది. చంద్రగ్రహణం వెనకున్న పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పురాణాల ప్రకారం.. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రం మథనం చేస్తారు. దీంతో అమృతం బయటకు వస్తుంది. ఈ అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతారు. అయితే ఈ అమృతాన్ని తాగడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారం ఎత్తుతాడు. మోహినీ అవతారంలో ఉన్న విష్ణువు దేవతలకు అమృతాన్ని ఇస్తుంటే రాహువు అనే రాక్షసుడు కూడా దేవతల వేషధారణలో దేవతల మధ్యలో కూర్చుంటాడు. ఈ కారణంగానే మోహిని రాహువును దైవంగా భావించి అమృతం ఇస్తుంది.
అంతలోనే సూర్యచంద్రులు రాహువును గుర్తిస్తారు. ఈ విషయాన్ని విష్ణువుకు చెప్తారు. ఆ వెంటనే మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువు తలను, మొండెం నుంచి వేరు చేస్తాడు. అయితే రాహువు అమృతం తాగడం వల్ల అతను చనిపోడు. కానీ కానీ సుదర్శన చక్రం దాడికి రెండు భాగాలుగా విడిపోతుంది. వీటిలో శిరస్సును రాహువు అని, మొండెంను కేతు అని పిలుస్తారు.
చంద్రగ్రహణం ఎందుకు వస్తుంది?
హిందూ మత విశ్వాసాల ప్రకారం.. సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించడం ఈ కథతో ముడిపడి ఉంది. రాహువు గురించి సూర్యచంద్రులు విష్ణువుకు చెప్పినందుకు.. సూర్యచంద్రులతో శత్రుత్వ భావన కలుగుతుంది. దీని వల్ల సూర్యచంద్రులు ఎప్పటికప్పుడు ఇబ్బంది పడుతుంటారు. దీన్నే గ్రహణం అంటారు.