కలియుగం గురించి శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడో.. ఇప్పుడు అదే జరుగుతోందా?

Published : May 23, 2025, 02:01 PM IST

పురణాల ప్రకారం మహాభారత కాలంలో శ్రీ కృష్ణుడు.. పాండవులకు కలియుగం గురించి కొన్ని విషయాలు చెప్పాడట. అవి ప్రస్తుతం నిజమవుతున్నాయని చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు? ప్రస్తుతం ఏం జరుగుతోందో.. ఇక్కడ తెలుసుకుందాం.   

PREV
15
కలియుగం గురించి శ్రీకృష్ణుడు పాండవులకు ఏం చెప్పాడు? 

కలియుగం గురించి చాలా శాస్త్రాల్లో ప్రస్తావించారు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాండవులకు కలియుగం గురించి కొన్ని నిజాలు చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. కలియుగం ఎలా ఉంటుంది? ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి? మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది తదితర విషయాలు పాండవులకు వివరించాడట. అవి ఈ కాలంలో నిజమవుతున్నాయని చాలామంది నిపుణులు చెబుతున్నారు. మరి కృష్ణుడు కలియుగం గురించి ఏం చెప్పాడో ఇక్కడ చూద్దాం.

25
జ్ఞాపకశక్తి తగ్గుతుంది

మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు.. పాండవులకు కలియుగంలో మనుషుల జ్ఞాపకశక్తి తగ్గుతుందని చెప్పాడు. అంతేకాదు, ధర్మం, సత్యం, సహనం కూడా తగ్గుతాయని చెప్పాడు. ప్రస్తుతం చాలామందిలో మనం ఇది చూస్తున్నామని నిపుణులు చెబుతున్నారు.

35
గుణానికి కాదు.. డబ్బుకు ప్రాధాన్యం

కలియుగంలో ఒక వ్యక్తిని అతని గుణాలతో కాకుండా డబ్బుతో గుర్తిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారికే గౌరవ, మర్యాదలు దక్కుతాయని కృష్ణుడు వివరించాడు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. 

45
జ్ఞానం లేకపోయినా పండితులవుతారు

కలియుగంలో జ్ఞానం, ధర్మం మీద దృష్టి పెట్టరని శ్రీ కృష్ణుడు.. పాండవులతో చెప్పాడట. అంతేకాదు ఎవరు చనిపోతారు? ఎవరి ఆస్తిని ఎలా సొంతం చేసుకోవాలనే ఆలోచనలు కూడా మనుషుల్లో ఎక్కువగా ఉంటాయని కృష్ణుడు వివరించాడట. సరిగ్గా ఇలాంటి సంఘటనలను మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నామనేది నిపుణుల మాట.

55
దుఃఖంలో ఒంటరిగా ఉంటారు

పురాణాల ప్రకారం కలియుగంలో ఒక వ్యక్తి దుఃఖంలో ఒంటరిగా ఉంటాడని శ్రీ కృష్ణుడు ముందుగానే చెప్పాడు. అంతేకాదు సంతోష సమయంలో చాలా మంది చుట్టూ ఉంటారని కూడా వివరించాడట. ఇది చాలామంది వారి జీవితంలో ఏదో ఒక టైంలో ఎదుర్కొనే ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories