Ugadi: కొత్త సంవత్సరం రోజున శుభ ఫలితాలు ఇచ్చే 4 మంత్రాలు

Published : Mar 18, 2026, 02:34 PM IST

Ugadi: ఉగాది రోజున ఈ 4 మంత్రాల ద్వారా ఏడాదంతా శుభ ఫలితాలు, సానుకూల మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఉగాది అంటే కొత్త సంవత్సరం ఆరంభం. కొత్త పనులకు శ్రీకారం చుట్టాల్సిన శుభదినం. 

PREV
15
ఉగాది రోజు జపించాల్సిన మంత్రం

ఈ పవిత్ర రోజున మనం చేసే ఆలోచనలు, పనులు, పూజలు..మొత్తం ఏడాది మీద ప్రభావం పడతాయని భావిస్తారు. అందుకే ఈ సమయంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. పండితుల ప్రకారం ఉగాది రోజున కొన్ని ప్రత్యేక మంత్రాలను జపిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, సంతోషం లభిస్తాయని చెబుతున్నారు. ఆ ముఖ్యమైన మంత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

25
మొదటిది సూర్యమంత్ర-ఓం సూర్యాయ నమః

ఉగాది రోజున ఉదయం సూర్యుడిని దర్శించుకుని ఈ మంత్రాన్ని జపిస్తే ఎంతో మంచి జరుగుతుందని భావిస్తున్నారు. ఇది ఆధ్యాత్మికత మాత్రమే కాదు శరీరానికి శక్తి, ఆరోగ్యం ఇస్తుందని జీవితంలో ఉత్సాహం పెరుగుతుందని నమ్ముతారు.

35
లక్ష్మీ మంత్రం- ఓం శ్రీం హ్రీం క్లీం మహా లక్ష్మీయే నమః

లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే సంపద, అష్టైశ్వార్యాలు వస్తాయని చెబుతారు. భక్తితో ఈ మంత్రం జపిస్తే ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్యం వస్తుందని విశ్వసిస్తారు. ఇంట్లో సానుకూల వాతావరణం కూడా పెరుగుతుంది. 

45
విష్ణుమంత్రం-ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

ఈ మంత్రం మనసుకు ప్రశాంతత ఇస్తుంది.ఆందోళన, టెన్షన్ తగ్గి...మనసు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుందని చెబుతారు. కొత్త ఏడాదిని ప్రశాంతంగా ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన మంత్రం.

55
ఉగాది పచ్చడి మంత్రం

శతాయ వజ్ర దేహాయ సర్వ సంపత్కరాయచ సర్వారిష్ట వినాశయ నింబకం దళభక్షణం. ఈ మంత్రాన్ని ఉగాది పచ్చడి తీసుకునే సమయంలో జపిస్తారు. పచ్చడిలోని ఆరు రుచులు జీవితంలోని ఆనందం, బాధ, కోపం, ఆశ్చర్యం, భయం, విరక్తి లాంటి భావాలను సూచిస్తాయి. ఈ మంత్రం ద్వారా అన్ని కష్టాలు తొలగి...శుభపలితాలు కలగాలని ప్రార్థిస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories