50 ఏళ్ల తర్వాత కుజ పుష్య యోగం: ఈ 3 రాశుల వారికి దశ తిరిగినట్టే

Published : Jan 23, 2025, 01:52 PM IST

కుజ పుష్య యోగం అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక శుభ యోగం. 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ యోగం ఈ ఏడాది ఏప్రిల్ లో రాబోతోంది. కుజ పుష్య యోగం వల్ల 12 రాశుల్లో 3 రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఆ రాశుల్లో మీ రాశి ఉందో లేదో ఇక్కడ తెలుసుకోండి.   

PREV
15
50 ఏళ్ల తర్వాత కుజ పుష్య యోగం: ఈ 3 రాశుల వారికి దశ తిరిగినట్టే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికల ఆధారంగా ఈ భూమ్మీద ఉన్న ప్రతి జీవి జీవితం సాగుతుంది. ముఖ్యంగా మనుషులు జన్మించినప్పుడు ఆ సమయంలో ఉన్న గ్రహాల స్థానాన్ని బట్టి పుట్టిన బిడ్డ జీవితం ఎలా ఉండబోతోందని ముందుగానే జ్యోతిష్యులు చెప్పగలరు. తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు చూసుకొని ఎందరో ముఖ్యమైన పనులు ప్రారంభించి సత్ఫలితాలు పొందుతుంటారు. అలా జ్యోతిష్యాన్ని నమ్మే వారికి ఈ విషయం చాలా ఆనందాన్నిస్తుంది. 
 

25

50 సంవత్సరాల తర్వాత కుజుడు శనేశ్వరుని నక్షతంలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల 3 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ శుభ ఘడియ ఏప్రిల్ 12న రానుంది. ఆ రోజు ఉదయం 6:32 గంటలకు కుజ గ్రహం శని గ్రహం నక్షత్రమైన పుష్య నక్షత్రంలోకి ప్రవేశించనుంది. ఇది కలయిక మంగళ- పుష్య యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం కారణంగా 3  రాశుల వారికి ప్రత్యేకంగా లాభాలు కలిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ యోగ కాలం ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాశులు వారు చేసిన ప్రతి పని సక్సెస్ అవుతుంది. ఆ రాశులు ఏంటంటే..
 

35

కర్కాటక రాశి: ఈ రాశి వారిలో వ్యాపారస్థులు ఎవరైనా ఉంటే వారికి పెద్ద వ్యాపార ఒప్పందాలు రావచ్చు. 
శనిలోకి కుజుడు ప్రవేశించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. వారి ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి.
 

45

కన్య రాశి: ఈ రాశి వారికి శుభ యోగం వల్ల ఉద్యోగాలలో ప్రమోషన్‌లు రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. జీతం కూడా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అప్పుల బాధలు లాంటివి తీరి పోతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యాపార ప్రారంభం చేస్తే కచ్చితంగా లాభాలు పొందవచ్చు.
 

55

మీన రాశి: కుజ పుష్య యోగం వల్ల వ్యాపారులకు లాభం కలుగుతుంది. కొత్త ఆర్డర్లు వెతుక్కుంటూ వస్తాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. కొత్త కారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

గమనిక: ఈ యోగ ప్రభావం మీ వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
 

click me!

Recommended Stories