
జీవితంలో కుంభమేళా ఒక్కసారైనా వెళ్లాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే.. హిందువులు.. కుంభమేళాను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. కుంభమేళాలోని పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల.. ఈ జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్మకం. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికిన సమయంలో ఆ అమృతం చుక్కలు ఇక్కడ పడ్డాయని నమ్ముతారు. అందుకే.. కచ్చితంగా ఒక్కసారైనా వెళ్లాలని అనుకుంటారు. అందులోనూ.. ఈ ఏడాది వచ్చింది మహా కుంభమేళా. ఇదిజజ ప్రతి 12 సంవత్సరాలకు మాత్రమే వస్తుంది. మీరు కూడా ఈ మహా కుంభమేళాకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే.. ఎలా వెళ్లాలి..? హైదరాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళా వెళ్లడానికి ఒక్క మనిషికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం....
ఎలా వెళ్లాలి..?
ప్రయాగ్ రాజ్ వెళ్లాలి అంటే.. మనం లక్నో, అయోధ్య,వారణాసి.. ఈ మూడింటి నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ.. లక్నో నుంచి వెళ్లడం కాస్త ఎక్కువ సులువుగా ఉంటుంది. మీరు కనుక హైదరాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్లాలి అనుకుంటే.. ముందుగా.. బస్సు, ట్రైన్, విమానం ఏదైనా మార్గం ఎంచుకొని అక్కడి నుంచి ముందుగా లక్నో చేరుకోవాలి.
లక్నో నుంచి రోడ్డు మార్గంలో మూడు గంటలు , 140 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే.. మీరు అయోధ్య చేరుకుంటారు. అక్కడ అయోధ్య రామయ్యను దర్శించుకొని.. ఆ రోజు అక్కడే బస చేయవచ్చు. అయోధ్య అందాలను ఆ రాత్రిపూట మీరు వీక్షించవచ్చు. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే.. అయోధ్య నుంచి నాలుగు గంటల ప్రయాణం.. రోడ్డు మార్గంలో 1770 కిలో మీటర్లు ప్రయాణం చేస్తే.. కుంభమేళాకు చేరుకుంటారు. అక్కడ నదీ స్నానం ఆచరించిన తర్వాత... అక్కడి నుంచి మరో మూడు గంటలు ప్రయాణం చేస్తే వారణాసి చేరుకుంటారు. వారణాసిలో కాశీ విశ్వేస్వరుడిని దర్శించుుకొని.. ఆ తర్వాత వారణనాసి వీధులు మొత్తం మీరు తిరిగి రావచ్చు. లేదంటే.. వారణాసి స్కిప్ చేసి మీరు కుంభమేళా దగ్గర నుంచి రిట్నర్ లక్నో వెళ్లొచ్చు. లేదంటే... వారణాసి కూడా చూసి.. అక్కడి నుంచి లక్నో వెళ్లిపోవచ్చు.
మీరు హైదరాబాద్ నుంచి లక్నోకి విమానంలో వెళ్లి.. ఆ తర్వాత అక్కడి నుంచి అయోధ్య, అక్కడి నుంచి కుంభమేళా, అక్కడి నుంచి వారణాసి రోడ్డు మార్గంలో ప్రయాణించి... మళ్లీ అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్ కి చేరుకుంటే... ఒక్క మనిషికి రూ.35వేలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న వారికి మరికొంత తక్కువ లోనే అయిపోతుంది. అలా కాకుండా మీరు ట్రైన్ లో వెళ్లి ఉంటే.. తక్కువలో తక్కువ ఒక్కో మనిషికి రూ.15వేల ఖర్చుతో పూర్తౌతుంది.
మరింత సమాచారం...
కుంభం మేళా లకు వెళ్లినవారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళా ని సెక్టార్ లు గా, కాటున్ పాండ్స్ గా, ఘాట్స్ గా విభజించారు వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి, లేక పోతే అస్సలు ఏమి అర్ధం కాదు, ఎటు వెళ్లి ఎటు వస్తారో మీకు అర్ధం కాదు.
3.మొత్తం 24 సెక్టర్స్ ఉంటాయి
4.16-17కాటున్ పాండ్స్ ఉంటాయి. (నదికి మధ్యలో బ్రిడ్జి ల నిర్మించారు వాటినే కంటూన్ పాండ్స్ అంటారు )
4.ప్రయాగ రాజ్ ని మూడు గా విభజించారు A.జ్యూస్సి ,B.
హరిలాగంజ్ C.సంగం
5.నది కి కుడి వైపు జ్యూస్సి ఉంటుంది దీనిలో సెక్టర్ (12 నుండి 21 వరకు ఉంటాయి.
6.హరిలాగంజ్ ఇది నదిదాటి ఎడమ వైపు నా ఉంటుంది దీనిలో సెక్టార్ (5,11,10,9,8,7,6,18,19)ఉంటాయి.
7.ముఖ్యం మైంది, సంగం దీనిలో ఇది మెయిల్ రోడ్ కి దగరలో ఉంటుంది దీనిలో సెక్టార్ 3,4,ఉంటాయి.
వసతి విషయానికి వస్తే.....
9.సెక్టర్ 6 లో TTD వాళ్లు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా చూడండి. కానీ అక్కడ stay చేయనివ్వరు, స్వామి వారికీ బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకొనివ్వరు.
10.మీరు అక్కడ పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు వున్నాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు. (.ముఖ్యం గా సెక్టార్ 18లో స్టే చేయవాచ్చు నదికి 100 మీటర్లు లో ఉంటాయి.)
11.సెక్టర్ 19,18,20 ఈ సెక్టర్స్ లో నాగసాధువు లు, అఘోరాలు, వుంటారు వాళ్ళు దగ్గరికి వెళ్తే ఏంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండ మంటారు చక్కగా ఉండొచ్చు.
12.సెక్టార్ 1లో ప్రవైట్ సదుపాయాలు ఉంటాయి రోజు కి 200 రూపాయలు
13.అన్ని సెక్టార్ లో పెయిడ్ వసతులు కలవు రోజుకి 1000 -2000 తీసుకుంటారు( 4 మెంబర్స్ వరకు ఉండొచ్చు ).
భోజన సదుపాయాలు...
14.మీకు అన్ని సెక్టార్ లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి (ఉత్తర భారతదేశం వంటకలు అన్ని అక్కడ ఫ్రీ గా తిన్నవచ్చు…
హెల్ప్ లైన్ నెంబర్స్...
15.మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా పోలీస్ లు మీమల్ని గైడ్ చేస్తారు.
16.మేళా లో అయితే పోలీస్ లు అడుగడుగునా మన కు ఎటువైపు వేళలో చాలా బాగా చెప్తారు.
17.ఎవరైతే పుణ్యం స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్ లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా.
18. 2-3days వుండే వాళ్లు మాత్రమే ఎదో ఒక సెక్టార్ నదికి దగ్గరో వుంటుంది అక్కడే ఉండడం మంచిది, లేకపోతే నదికి, సెక్టార్ కి దూరమైత్ తప్పిపోయే అవకాశం కలదు.