కన్యాకుమారిలో ఖచ్చితంగా చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఇవే..!

First Published Nov 19, 2021, 4:02 PM IST

భారతదేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక స్థలంగా కూడా ప్రసిద్ధి. కన్యాకుమారిని (Kanyakumari) తమిళనాడు రాష్ట్రంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటిగా భావిస్తారు. ఈ ప్రదేశం పర్యాటక ప్రియులకు సందర్శించడానికి అనువైన ప్రదేశం. ఇక్కడి ప్రశాంత వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. కన్యాకుమారిని చుట్టుముట్టి అనేక సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇందులో తప్పక చూడవలసిన ప్రదేశాలు తిరువనంతపురం, పూవార్, తూత్తుకుడి, మధురై. ఇక్కడి ప్రకృతి అందాల సోయగాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రకృతి అందాలను సందర్శించడానికి భారతదేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా కన్యాకుమారి చుట్టూ ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
 

తూత్తుకుడి: తూత్తుకుడి (Thoothukudi) కన్యాకుమారి నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కన్యాకుమారి నుండి తూత్తుకుడి చేరుకోవడానికి సుమారు 2:30 గంటల సమయం పడుతుంది. ఈ ప్రాంతానికి టుటికోరిన్ (Tuticorin) పేరు కూడా ఉంది. ఇక్కడ ఎన్నో పారిశ్రామిక ప్రదేశాలు, అందమైన బీచ్లు ఉన్నాయి. వీటి అందాలను చూడడానికి భారతదేశంలోని నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.  ఇక్కడ హెర్బల్ బీచ్, ముత్తు నగర్ న్యూ బీచ్, రోచె పార్క్, టుటికోరిన్ బే తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు. ఇది మున్నార్ గల్ఫ్ ను కలుపుతున్న తీరప్రాంతం. ఈ ప్రదేశం ఉప్పు, ఆఫ్ షోర్ ట్రేడింగ్, ఫిషింగ్ వ్యాపారం కోసం అనుకూలమైన ప్రదేశం.
 

తిరువంతపురం (Thiruvananthapuram): ఈ ప్రాంతం కన్యాకుమారి నుండి ఏలూరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం త్రివేండ్రంగా (Trivandrum) ప్రసిద్ధి. ఇది కేరళ రాష్ట్రంలోని అతిపెద్ద నగరం. ఇక్కడి అందమైన పచ్చని హరిత వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రాంతం మహాత్మా గాంధీజీ ఎవర్ గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా అని పిలువబడుతోంది. ఈ ప్రాంతంలో ఎన్నో సందర్శించవలసిన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో పద్మనాభస్వామి ఆలయం, నేపియర్ మ్యూజియం, కుటీరా మాలికలు, కోయికల్ ప్యాలెస్ త్రివేండ్రం తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు. ఈ ప్రాంత సందర్శన మీకు తప్పక మధురమైన అనుభూతులను కలిగిస్తుంది.
 

మధురై: మధురై (Madurai) కన్యాకుమారి నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి కన్యాకుమారి చుట్టూ ఉన్న ప్రసిద్ధ నగరాలలో మధురై ఒకటి. మధురై నగరం వైగై నది (Vaigai River) ఒడ్డున ఉంది. ఇక్కడ ఎన్నో ప్రసిద్ధిచెందిన అందమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో మీనాక్షి అమ్మన్ ఆలయం, తిరుమలై నాయకర్ మహల్, కూడల్ అజగర్ ఆలయం, కాజిమార్ పెద్ద మసీదు ఇలా ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి.
 

పూవార్ (Poovar): కన్యాకుమారి నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక అందమైన తీర ప్రాంతం (Coastal area). కన్యాకుమారిని చుట్టుముట్టిన ఈ ప్రాంతం అనేక సందర్భాల్లో ప్రదేశాలను కలిగి వుంది. అజీమల శివాలయం, బొటానికల్ గార్డెన్ ఎలిఫెంట్ రాక్, రాయల్ బ్యాక్ వాటర్ ఇక్కడి సందర్శన ప్రదేశాలు ముఖ్యమైనవి.

click me!