శని యొక్క కదలిక ప్రజల జీవితం పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ శని యొక్క వక్రదృష్టి తమ మీద పడకుండా చూసుకోవాలి. శని దేవుడిని పూజించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. శని దేవుడుని పూజించేటప్పుడు అతని ముందు దీపం వెలిగించడం మానుకోవాలి.
దీనికి బదులుగా రావి చెట్టు కింద దీపం వెలిగించండి. మీరు ఇంట్లో ఉన్నట్లయితే పశ్చిమ దశలో శని దేవుడిని ధ్యానిస్తూ మంత్రాలని జపించండి. ప్రతి శనివారం క్రమం తప్పకుండా శని దేవుడుని ఆరాధించండి. గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ శనిదేవుని కళ్ళల్లోకి నేరుగా చూడకండి.
కళ్ళు మూసుకొని ప్రార్థించండి లేదంటే శని దేవుని పాదాల వైపు చూస్తూ ప్రార్థించండి. అలాగే శని దేవుడి ని పూజించేటప్పుడు ఎరుపు బట్టలు వీలైనంత మటుకు వేసుకోకండి. శనికి ఇష్టమైన రంగులు నలుపు, నీలం. వీలైనంత మట్టుకు శని దేవుడుని పూజించేటప్పుడు నలుపు బట్టలు కట్టుకొని పూజించడం ఉత్తమం.
అలాగే శని దేవుడు కోసం మీరు నూనెని ఇవ్వాలనుకుంటున్నప్పుడు రాగి పాత్రలు ఉపయోగించవద్దు. ఎప్పుడూ ఇనుప పాత్రలోనే ఉపయోగించండి. శని దేవుడు ని ఆరాధించేటప్పుడు దిశపై కూడా దృష్టి పెట్టండి. సాధారణంగా మనం తూర్పు వైపున దేవుడిని పెట్టుకొని అటు వైపు తిరిగి పూజలు చేస్తాము.
కానీ శని దేవుణ్ణి పూజించేటప్పుడు మాత్రం పశ్చిమానికి ఎదురుగా నిలబడి పూజించండి. ఎందుకంటే పశ్చిమ దిక్కు కి అధినేత శని దేవుడు. అలాగే శని దేవుడి పటాన్ని మన దేవుడు గదిలో గాని మన ఇంట్లో గాని ఉంచుకోకూడదు. అలా చేయటం వలన ఇంటిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
అలాగే పూజ అయిపోయిన తర్వాత శని దేవుని వైపు వీపు చూపించకుండా అడుగులు వెనక్కి వేస్తూ వెనక్కి వెళ్ళండి. ఎందుకంటే శని దేవుడికి వీపు చూపిస్తే ఆయన ఆగ్రహానికి తప్పక గురవుతారు. కాబట్టి ఈ తప్పులు చేయకుండా శని దేవుని అనుగ్రహానికి పాత్రులు కండి.