Spiritual: నాగ దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ రోజు సాయంత్రం ఈ ఆలయానికి వెళ్ళి తీరాల్సిందే!

First Published | Aug 21, 2023, 11:25 AM IST

Spiritual: నాగ దోషం అనేది హిందూమతంలో ఒక విశ్వాసం. ఒక వ్యక్తి జాతకం ప్రకారం నాగదోషం ఉంటే కచ్చితంగా పరిహారం చేయించుకోవాలి. అయితే ఈ గుడికి వెళ్లడం ద్వారా అలాంటి పరిహారాలు జరుగుతాయి అంటారు పెద్దలు. అదెక్కడో చూద్దాం.
 

ఒక వ్యక్తికి నాగదోషం ఉంటే అది అరిష్టం. ఆర్థిక నష్టానికి, సంతాన నష్టానికి దారితీస్తుంది. ఆ దోషం పోవాలంటే ఖచ్చితంగా పరిహారం చేసుకొని తీరాలి. అలాగే చాలా సంవత్సరాలు వరకు పెళ్లి కాకపోయినా, పెళ్లయినప్పటికీ పిల్లలు పుట్టకపోయినా అది నాగదోషంగా భావించాలి.
 

నాగ దోషం అనేది పూర్వజన్మలో పాములుని చంపే వారికి, ఔషధాలతో సర్పాలని బంధించే వారికి, పుట్టలను తవ్వే వారికి, పుట్టలను తొలగించి ఇల్లు కట్టుకునే వారికి నాగదోషం తగులుతుందని పెద్దలు చెప్తారు. జాతక చక్రంలో రాహువు లేదా కేతువు 1,2, 5, 7, 8 స్థానంలో ఉండి..
 


ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా.. అశుభ స్థానాల్లో ఉంటే సర్పదోషం ఉందని చెప్తారు. ఇలాంటి వాళ్లు సమయానికి సంతానం లేక ఇబ్బంది పడతారు. అలాగే సమయానికి వివాహాలు కూడా జరగవు. ఇలాంటి వాళ్లు కచ్చితంగా పరిహారం చేయించుకొని తీరాలి. నాగ దోషంతో ఇబ్బంది పడేవారు కృష్ణాజిల్లాలో ఉండే మోపిదేవి ఆలయానికి కచ్చితంగా వెళ్లాలి.
 

ఈ ప్రాంతం మచిలీపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీనిని మోహినీపురం అని కూడా పిలుస్తారు. మోపిదేవి ఆలయం చాలా విశిష్టమైనది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో వెలిశాడు. నాగ పంచమి రోజు ఈ విశిష్టమైన క్షేత్రానికి..
 

ఈ దేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. సర్ప దోషంతో బాధపడేవారు, వివాహం జరగక బాధపడేవారు, సంతానం కోసం ప్రయత్నించే వారు మోపిదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితం పొందుతారని భక్తుల విశ్వాసం.
 

అలాగే ఈ గుడికి ఉన్న ఇంకొక విశిష్టత ఏమిటంటే స్వామివారి పానవట్టం లోని ఒక కన్నం నుంచి సంవత్సరానికి ఒక సారి ఒక నాగుపాము బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ పూజలు చేయించుకుంటే ఎలాంటి సర్ప దోషాలైనా పోతాయనేది ప్రగాఢ విశ్వాసం.

Latest Videos

click me!