కార్తీక మాసం నియమాలు
కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేస్తే భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయట. నదీ స్నానం పాపాలన్నీ కడిగి మోక్షం ప్రసాధిస్తుందని నమ్ముతారు. కార్తీక మాసంలో తులసి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతిరోజూ తులసి మొక్క దగ్గర దీపం ఉంచి ప్రదక్షిణలు చేయండి. కార్తీక మాసంలో ఆహారం, ఉన్ని బట్టలు, నువ్వులు, దీపాలు, ఉసిరిని దానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం.