కార్తీక మాసంలో ఇలా చేస్తే త్వరగా పెళ్లి అవుతుంది

First Published | Nov 5, 2023, 9:38 AM IST

kartika masam 2023: హిందూ  మతంలో కార్తీక మాసం శ్రీమహావిష్ణువు పూజకు  అంకితం చేయబడింది. ఈ మాసంలో విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే పుణ్య ఫలాలు లభిస్తాయి నమ్మకం. కార్తీక మాసం పండుగల మాసంగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ మాసంలో దీపావళి, ఛాత్ పండుగలు వస్తాయి. 
 

kartika masam 2023: ఈ ఏడాది కార్తీక మాసం ఆదివారం నుంచి ప్రారంభమై నవంబర్ 27 సోమవారంతో ముగుస్తుంది. కార్తీక మాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. తులసి వివాహం కూడా ఈ మాసంలోనే జరిగిందని చెప్తారు. అందుకే ఈ కార్తీక మాసంలో తులసిమాతకు కొన్ని పరిహారాలు చేస్తే పెళ్లిళ్లు తొందరగా అవుతాయని నమ్మకం కూడా ఉంది. 
 

మీ వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలు వస్తే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. వైవాహిక సమస్యలతో సతమతమవుతున్నవారు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ తర్వాత తులసికోటకు నీటిని సమర్పించండి. ఈ పరిహారాన్ని చేస్తే వివాహంలో వచ్చే అన్ని రకాల అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.
 

Latest Videos


కార్తీక మాసంలో తులసిమాత, శాలిగ్రామం వివాహం చేసుకున్నారని నమ్ముతారు. అందుకే ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఏకాదశి నాడు తులసి వివాహం ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయడం వల్ల అమ్మాయిలకు తగిన వరుడు దొరుకుతాడని నమ్ముతారు.

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి లేదా ఏకాదశి నాడు తులసి మాతకు ఎర్రచందనం సమర్పించాలని పండితులు చెబుతున్నారు. హిందూమతంలో ఎర్ర చందనాన్ని సంతోషానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే మీరు ఈ పరిహారాన్ని చేస్తే మీ పెళ్లి త్వరలోనే అవుతుందంటున్నారు పండితులు. అంతేకాదు ఈ పరిహారంతో వైవాహిక జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. 
 

click me!