దీపావళి ఉపవాసం కథ
పురాణాల ప్రకారం.. ఒకసారి లక్ష్మీదేవి కార్తీక మాసం అమావాస్య రోజు వైకుంఠధామం నుంచి భూలోకానికి వస్తుంది. అమవాస్య కారణంగా చుట్టూ చీకటిగా ఉండటంతో ఆమె తిరిగి వెళ్లేందుకు దారి తప్పుతుంది. దీంతో అమ్మవారు ఆ రాత్రి భూలోకంలోనే ఉండి సూర్యోదయం తర్వాత వైకుంఠధామానికి వెళదామని అనుకుంటుంది. అయితే రాత్రి పొద్దుపోవడంతో అందరూ తలుపులు మూస్తారు. అయితే అమ్మవారికి దూరం నుంచి ఒక ఇంటి తలుపులు తెరిచి, దీపం వెలిగించిన ఇళ్లు కనిపిస్తుంది. దీంతో అమ్మవారు ఆ ఇంటికి వెళుతుంది. లోపలికి వెళ్లడానికి ఆ ఇంట్లో ఉన్న వృద్ధురాలి అనుమతితో ఆ రాత్రంతా అమ్మవారు అక్కడే ఉంటుంది. అయితే ఆ వృద్ధురాలు నిద్రలేచేసరికి అమ్మవారు ఉండదు. అలాగే చిన్న ఇళ్లు రాజభవనంలా మారుతుంది. అంతేకాదు ఆ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు, రత్నాలు, ధాన్యం, నగలే కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి.