కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఎన్ని దీపాలను పెట్టాలి? ఏ దిక్కున పెట్టాలి?

First Published | Nov 25, 2023, 10:35 AM IST

Karthika Deepam 2023: ఈ ఏడాది కార్తీక పౌర్ణమి పండుగను నవంబర్ 26న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. మరి ఈ రోజు ఏం చేయాలి? ఎన్ని దీపాలను వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

 హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగల్లో  "కార్తీక  పౌర్ణమి" ఒకటి. ఇతర పండుగల మాదిరిగానే కార్తీక పౌర్ణమి పండుగను కూడా సంతోషంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇండ్లలో దీపాలను వెలిగిస్తారు. వీటిని కార్తీక దీపాలు అంటారు. ఈ రోజున మహావిష్ణువును, శివుడిని పూజిస్తారు. 

ఈ ఏడాది కార్తీక దీపం ఎప్పుడు?

కార్తీక దీపాన్ని తమిళ మాసం కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీని ప్రకారం ఈ ఏడాది కార్తీక మాసాన్ని ఆంగ్ల మాసం నవంబర్ 26 ఆదివారం నాడు జరుపుకోనున్నారు.  
 

ఈ రోజు ఏం చేయాలి? 

ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రజలు తమ ఇళ్ల ముందు కొత్త దీపాలను వెలిగిస్తారు. అయితే ఇంట్లో మాత్రం ఇంతకు ముందు వాడిన దీపాలను పెట్టొచ్చు. ఇంతకంటే ముందు వాటిని శుభ్రం చేయాలి. కార్తీక దీపం నాడు శుభ్రమైన ప్రమిదల్లో నూనె పోసి దీపాలను వెలిగించాలి. దీపాన్ని వెలిగించడానికి ఆముదం నూనె, నువ్వుల నూనె లేదా నెయ్యిని మాత్రమే  ఉపయోగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

Latest Videos


దీపం వెలిగించడానికి సరైన దిశ ఏది?

కార్తీక పౌర్ణమి నాడు తూర్పు దిక్కున దీపాన్ని వెలిగిస్తే మీ కష్టాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది.

పడమటి దిశలో దీపాన్ని వెలిగించడం వల్ల రుణ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందట.

అలాగే ఉత్తరదిశలో దీపాన్ని వెలిగిస్తే వివాహానికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది.

ఈ దిశలో దీపాలను వెలిగించకూడదు

కార్తీక దీపాన్ని దక్షిణదిశలో వెలిగించకూడదు. 
 

దీపాన్ని ఎలా వెలిగించాలి?

ఒక ముఖం ఉన్న దీపాన్ని వెలిగించడం వల్ల మీరు అనుకున్నవి తప్పకుండా నెరవేరుతాయి.
రెండు ముఖాలున్న దీపాన్ని వెలిగించడం వల్ల మీ కుటుంబానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
మూడు ముఖాల దీపాన్ని వెలిగిస్తే సంతానం కలుగుతుంది.
నాలుగు ముఖాల దీపం వెలిగిస్తే సిరి సంపదలు పెరుగుతాయి.
ఐదు ముఖాలునన దీపాన్ని వెలిగిస్తే సకల ప్రయోజనాలు కలుగుతాయి.

కార్తీక పౌర్ణమి నాడు ఎన్ని దీపాలు వెలిగించాలంటే? 

ఈ కార్తీక పౌర్ణమి నాడు 27 దీపాలు వెలిగించాలి. 27 దీపాలంటే 27 నక్షత్రాలు అని అర్థం. అయితే మీరు 27 దీపాలను వెలిగించపోతే కనీసం 9 దీపాలనైనా వెలిగించండి. 

click me!