ఈ వినాయక నవరాత్రుల వేళ... ఒక్కరోజు వినాయకుడు కలలో కనిపించినా చాలా శుభంగా జరుగుతుందని పరిగణిస్తారు. అంతేకాదు.. ఆ కలలో స్వామివారు కనపడటం వల్ల....వినాయకుడి అనుగ్రహంగా పరిగణిస్తారు.. దేవుడి రక్షణ కూడా లభిస్తుంది.. మీరు కోరుకున్న కోరికలన్నీ నిజమౌతాయి. మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడం కోసమే.. ఆ విగ్నేశ్వరుడు మీ కలలో కనిపిస్తాడని అర్థమట. విజయం, శ్రేయస్సు లభిస్తుంది.
గణేష్ ఉత్సవ్ సమయంలో గణేశుడిని కలలు కనడం మీ ప్రార్థనలు, కోరికలు నెరవేరబోతున్నాయనే సంకేతంగా కూడా అర్థం చేసుకోవచ్చు. విజయానికి దేవుడు , అడ్డంకులను తొలగించేవాడు, కలలో వినాయకుడి దర్శనం మీరు మీ లక్ష్యాలను సాధించే అంచున ఉన్నారని, ఏవైనా ఇబ్బందులు లేదా..ఏవైనా అడ్డంకులు ఉన్నా.. ఆ సమస్యలు తొందర్లోనే తొలగిపోతాయి.