రుద్రాక్ష చెట్లు ఎక్కడ ఉంటాయి..
భారతదేశంలో రుద్రాక్ష చెట్లు ప్రధానంగా హిమాలయ పర్వత ప్రాంతాలు, గంగా నదీ పరివాహక ప్రాంతాలలో కనిపిస్తాయి. అంతేకాకుండా నేపాల్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం ప్రాంతాలలో విస్తృతంగా లభిస్తాయి. ప్రపంచంలో ఉత్తమ రుద్రాక్షలు నేపాల్ ప్రాంతంలో లభిస్తాయి. హరిద్వార్, రిషికేష్ ప్రాంతాల్లో రుద్రాక్ష చెట్లు కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొన్ని రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. రుద్రాక్ష చెట్లు సాధారణంగా 3,000 మీటర్ల ఎత్తు వరకు ఉన్న పర్వత ప్రాంతాలలో, తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి.
* ఏ కోరికైనా నెరవేరడానికి 21 ముఖాల రుద్రాక్ష
సకల శుభకార్యాలు, ధనసమృద్ధి, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక పరిణితి అందించే దివ్యమైన రుద్రాక్ష 21 ముఖాల రుద్రాక్ష. ఇది అధికంగా వ్యాపారవేత్తలు, ఆధ్యాత్మిక సాధకులు ధరిస్తుంటారు.