దేవరగట్టులో ఉత్కంఠ.. కర్రల సమరం, బన్నీ ఉత్సవానికి సర్వం సిద్ధం!

First Published | Oct 15, 2021, 4:34 PM IST

ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ప్రజలంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పించి పండుగని జరుపుకుంటారు. 

ఈరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ప్రజలంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పించి పండుగని జరుపుకుంటారు. కానీ మరోచోట ఈరోజు కర్రల సమరంతో ఉత్సవం జరపనున్నారు.

కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో ఈరోజు కర్రల యుద్ధం ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో తలలు పగలగొట్టుకుని మరి యుద్ధం చేస్తారు. మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాల్లో ప్రతి ఏడాది ఈ యుద్ధం ఆచారంగా జరుగుతుంది.
 


ఇక ఈ ఏడాది కూడా ఈ ఉత్సవం జరగనుండగా ఈ యుద్ధంపై స్థానికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇటువంటి ఘోరమైన యుద్ధంలో తలలు పగులుతాయని మానవ హక్కుల కమిషన్ బాగా సీరియస్ అయ్యాయి. అంతేకాకుండా కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు కూడా నోటీసులు జారీ చేశారు.

ఇంత హింస జరిగినా కూడా పోలీసులు ఆపలేకపోతున్నారని వారిపై ఆగ్రహం చేస్తున్నారు మానవ హక్కుల కమిషన్. దీంతో ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొనే 22 గ్రామాల్లో పోలీసులు కొన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో పాల్గొని భక్తుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో లైట్ల ఏర్పాట్లను కూడా చేశారు. ఇక ఈ ఉత్సవం ఈరోజు నుంచి రేపటి వరకు జరగనుండగా అక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇక ఇలా చేయడానికి కారణం ఏంటంటే..

వందేళ్ళ కిందట దేవరగట్టులో వెలసిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం తర్వాత విగ్రహాలను సొంతం చేసుకునేందుకు ఆ ప్రాంత పరిసరాల్లో ఉన్న 12 గ్రామాల ప్రజలు రెండు విభాగాలుగా విడిపోతారు. ఇక ఈ రెండు వర్గాల మధ్య జరిగే ఉత్సవమే కర్రల యుద్ధం.

ఇందులో పాల్గొనే ప్రజలు కర్రలకు ఇనుప చువ్వను బిగించి ఉత్సవంలో పాల్గొంటారు. కొన్ని కొన్ని సార్లు ఇందులో హింసలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఇది తమ ఆచారమని తెలుస్తుంది.

ఇక ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలకు పైగా జనం తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ఇంతమంది ప్రజల మధ్య ఎటువంటి దాడులు జరగబోతుందో అని ముందుగానే పలు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా విద్యుత్, వైద్యశాఖ, ఫైర్ సిబ్బందిలను కూడా ఏర్పాటు చేశారు.
 

Latest Videos

click me!