మీరు గమనించారో లేదో... చాలా మంది తమ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకుంటూ ఉంటారు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే వాస్తు ప్రకారం.. ఇంటికి మంచిదని నమ్ముతారు. మంచి జరగడం మాత్రమే కాదు.. సంపద కూడా పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. అందుకే.. చాలా మంది పెంచుకుంటూ ఉంటారు. అయితే... ఇంట్లో పెట్టుకునే ఆ మనీ ప్లాంట్ మన డబ్బులతో కొని తెచ్చకున్నది కాకుండా... దొంగతనం చేసి పెట్టుకోవాలట. అలా దొంగతనం చేసి తెచ్చి పెట్టుకుంటే సంపద పెరుగుతుందని నమ్ముతున్నారు. ఇందులో నిజం ఎంత? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...
ఆ మనీ ప్లాంట్ ని ఏదైనా నర్సరీ నుంచి దొంగతనం చేస్తే సరిపోతుందని మీరు అనుకోవచ్చు. కానీ.. కాదంట. ఎవరైనా ధనవంతుల ఇంటి నుంచి దొంగతనం చేయాలట. మరి, దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది..? దీని వల్ల నిజంగా మనకు మంచి జరుగుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం...
ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
వాస్తు ప్రకారం, కొన్ని మొక్కలు ఇంట్లో నాటితే శ్రేయస్సు, ఐశ్వర్యం పెరుగుతాయి. ఈ మొక్కలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆటోమెటిక్ గానే.. ఆ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది.
మనీ ప్లాంట్ దొంగిలిస్తే?
మనీ ప్లాంట్ దొంగిలించడం సరైనదేనా?
ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచుకోవడం శుభప్రదం, కానీ ఇతరుల ఇంటి నుండి దొంగిలించడం తప్పు. వాస్తు ప్రకారం, దీనివల్ల ప్రతికూల శక్తి వస్తుంది. ఆ మొక్క వల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ రాకపోగా.... నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఫలితంగా.. అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
మనీ ప్లాంట్ కొనడం శుభం
మనీ ప్లాంట్ కొనుక్కోవడం మంచిది
వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ కొనుక్కుంటే ఎక్కువ లాభం. ఇది సానుకూల శక్తిని తెస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మన డబ్బులతో మనం కొనుక్కొని మొక్క ఇంటికి తెచ్చుకోవడమే మనకు మంచి చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
మనీ ప్లాంట్ నేలను తాకకూడదు
మనీ ప్లాంట్ నేలను తాకనివ్వకండి
వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ తీగ నేలను తాకితే, దాన్ని పైకి ఎక్కడైనా ఉంచాలి. వీలైనంత వరకు కిందకు మనీ ప్లాంట్ తీగలు పైకి పాకేలా చూడాలి. అప్పుడు మనకు ఇంట్లో శుభం జరుగుతుంది.