హిందూ శాస్త్రంలో ‘ఓం’ కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఓం అనే పదాన్ని ఇంట్లో రాయడం వల్ల ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు.. శివుని ఆశీర్వాదం కూడా లభిస్తుందని కూడా నమ్ముతారు. ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా చేయడంలోనూ సహాయపడుతుంది. ఎంట్లో వాస్తు దోషాలు ఉన్నా అవి కూడా తొలగిపోవడంలో హెల్ప్ చేస్తాయి. అయితే… ఓం ని ఇంట్లో కొన్ని ప్లేసుల్లో మాత్రం అస్సలు రాయకూడదట. మరి, ఎక్కడ రాయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం….
ఇంటికి దక్షిణ దిక్కులో…
ఇంటికి దక్షిణ దిశలో ఎప్పుడూ ఓం రాయకూడదు. ఎందుకంటే.. ఆ దిక్కును యమరాజుగా పరిగణిస్తారు. అది మన చనిపోయిన పూర్వీకులకు సంబంధించినది. ఆ దిశలో దేవతలు ఉండరు. అందుకే ఆ దిశలో పొరపాటున కూడా ఓం అని రాయకూడదు.
Om
ఇంటి ప్రధాన ద్వారం మీద ఓం అని రాయవద్దు
ప్రజలు తరచుగా ఇంటి ప్రధాన ద్వారం మీద ఓం చిహ్నాన్ని వేలాడదీస్తారు లేదా ఇంటి ప్రధాన తలుపుకు అనుసంధానించిన గోడపై ఓం అని వ్రాస్తారు. ఇంటి ప్రధాన ద్వారం మీద ఓం అని రాయడం తప్పు కాదు కానీ అది పై భాగంలో ఉండాలి. తలుపుకు కింది భాగంలో మాత్రం రాయకూడదు.
అలాంటి ఇంటి గోడపై ఓంను రాయవద్దు..
మరుగుదొడ్డి, బాత్రూమ్ లేదా స్వచ్ఛత లేని ప్రదేశానికి అనుసంధానించబడిన ఇంటి గోడపై ఓం చేయకూడదు. వంటగదిలో, ముఖ్యంగా మురికి లేదా ఉపయోగించిన పాత్రలను ఉంచే ప్రదేశంలో కూడా ఓం రాయకూడదు. ఇది శివుడిని అగౌరవపరచడం వంటిది. ఇంటికి అశుభాన్ని తెస్తుంది.
Om
ఇంటి పై కప్పు పై..
ప్రజలు తరచుగా ఇంటి పైకప్పు గోడ లేదా పైకప్పుపై ఓం చిహ్నాన్ని గీస్తారు. ఓం అంటే.. శివుని చిహ్నం అని గుర్తుంచుకోండి. అటువంటి పరిస్థితిలో, దానిని అలంకరణ కోసం ఉపయోగించవద్దు. ఇంటి పైకప్పు మీద ఓం గీయడం వల్ల తీవ్రమైన వాస్తు దోషం ఏర్పడి ఇబ్బందులు పెరుగుతాయి.