విజయదశమి లేదా దసరా పండుగను అశ్విని మాసం శుక్లపక్షం పదో రోజున జరుపుకుంటారు. రావణునిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు. అలాగే దుర్గాదేవి దసరా రోజున మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తుంది. దీనికి గుర్తుగా కూడా విజయదశమిని జరుపుకుంటారు. ఈ ఏడాది దసరా పండుగను ఏ రోజున జరుపుకోవాలనే దానిపై గందరగోళం ఏర్పడింది. కొన్ని చోట్ల ఈ పండుగను అక్టోబర్ 23న జరుపుకుంటే మరికొన్ని చోట్ల అక్టోబర్ 24న అంటే మంగళవారం నాడు జరుపుకుంటున్నారు.
రావణ దహన ముహూర్తం
ఉదయ తిథి ప్రకారం.. ఈ సంవత్సరం దసరా పండుగను అక్టోబర్ 24 అంటే మంగళవారం జరుపుకుంటారు. దసరా పండుగ రోజున రావణుడిని ప్రదోష రూపంలో దహనం చేయాలనే నియమం కూడా ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం పూట 5:43 గంటల నుంచి మరో రెండున్నర గంటల పాటు రావణ దహనం చేయొచ్చని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ సమయంలో ఎప్పుడైనా రావణుడిని దహనం చేయొచ్చని పండితులు చెబుతున్నారు.
విజయదశమి ప్రాముఖ్యత
రావణాసురుడిని సంహరిస్తూ శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించిన రోజు విజయదశమి రోజు. అలాగే ఈ రోజు దుర్గమాత మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తుంది. అందుకే దీనిని విజయదశమి అని పిలుస్తారు. ఈ రోజు జనాలు రావణాసురుడి దిష్టిబొమ్మను తయారు చేసి దహనం చేస్తారు. అంతేకాదు ప్రజలు తమలోని చెడును కూడా రావణుడి దిష్టిబొమ్మతో పాటే కాల్చాలని పండితులు అంటున్నారు.