navratri 2023: దేవీ నవరాత్రుల్లో కన్యాపూజ ఎలా చేయాలి? సరైన పద్ధతి ఇదే..!

First Published | Oct 22, 2023, 9:17 AM IST

navratri 2023: నేడు నవరాత్రుల్లో కన్యాపూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు అష్టమి నాడు కన్యను పూజిస్తే.. మరికొందరు నవమి నాడు అమ్మాయిలను పూజిస్తారు. ఈ పూజతో అమ్మవారు ఎంతో సంతోషిస్తారని నమ్ముతారు. మీరు కూడా కన్యాపూజ చేస్తున్నట్టైతే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి. 
 

navratri kanya pujan 2023

navratri 2023: నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. నవమి తిథి నాడు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉండి తొమ్మిది మంది బాలికలను పూజించే సంప్రదాయం ఉంది. తొమ్మిది మంది అమ్మాయిలను తమ ఇంటికి ఆహ్వానించి.. ఆచారాలతో పూజించి వారి ఆశీస్సులను తీసుకుంటారు. ఈ పూజను కన్య పూజ అని అంటారు. అయితే ఈ పూజను కొందరు అష్టమి రోజున చేస్తారు. ఈ ఏడాది నవమి తిథి అక్టోబర్ 23న వస్తుంది. కాబట్టి ఈ రోజున తొమ్మిది మంది అమ్మాయిలను ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

navratri kanya puja 2022

కన్యా పూజ ఎలా చేయాలంటే? 

ఉదయాన్నే ఇంటిని, ఇంట్లోని ఆలాయాన్ని నీటితో శుభ్రం చేయాలి. 

స్నానం చేసి తొమ్మిది మంది బాలికలను పూజించడానికి కావాల్సిన సామాగ్రిని తీసుకురావాలి. 

అమ్మాయిలందరూ వచ్చాక కాళ్లను కడుక్కోవాలి.  

పాదాలు కడిగిన తర్వాత వీరిని ఆసనం మీద కూర్చోబెట్టాలి.


kanya pujan navratri 2023

కూర్చున్న తర్వాత తొమ్మిది మంది అమ్మాయిలకు బొట్టు పెట్టి అక్షింతలు జల్లాలి. 

ఒక్కొక్కరు ఒక్కో చునారీని ధరించాలి. ఆ తర్వాత వారికి హారతినివ్వాలి. 

ఆ తర్వాత ప్లేట్ లో ఆహారం, ఒక గ్లాసు నీటిని వారికి ఇవ్వాలి. 

మినుములు, పండ్లు, ప్యూరీ-ఖీర్ ను వారికి సర్వ్ చేయాలి.

అమ్మాయిలందరూ భోజనం చేశాక చేతులు కడుకున్నాక వారికి దక్షిణం ఇవ్వాలి.

kanya pujan navratri 2023

వారి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే ఆప్యాయతతో వారికి వీడ్కోలు చెప్పాలి.

9 మంది అమ్మాయిలు దొరక్కపోతే 5 లేదా 7 మంది అమ్మాయిలను కూడా పూజించొచ్చు.

కొంతమంది నేటి పిల్లల ఇష్టాన్ని బట్టి వారికి మిఠాయిలు, చాక్లెట్లు, చేతి రుమాలు, ప్లేట్లు, గ్లాసులు వంటివి కూడా ఇస్తారు. అమ్మాయిలందరూ సంతోషంగా ఉండాలని ఇంటి నుంచి వెళ్లిపోవాలనేది వారి ఉద్దేశ్యం.

Latest Videos

click me!