దీపావళి రోజున ఏ రాశివారు ఏ వస్తువు దానం చేయాలో తెలుసా?

Published : Oct 23, 2024, 12:12 PM IST

  జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏం దానం చేస్తే వారికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం…  

PREV
113
దీపావళి రోజున ఏ రాశివారు ఏ వస్తువు దానం చేయాలో తెలుసా?

 

దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ పండగను దేశవ్యాప్తంగా అందరూ చాలా ఆనందంగా జరుపుకుంటారు. అయితే.. దీపావళి వేళ ఇంటిని అలంకరించుకోవడం, టపాసులు కాల్చడమే కాదు.. దాన దర్మాలు కూడా చేయాలట. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏం దానం చేస్తే వారికి మంచి జరుగుతుందో తెలుసుకుందాం…

 

213
telugu astrology

 

1.మేష రాశి..

ప్రస్తుతం బయట చలి చంపేస్తుంది. ఈ చలికారంగా చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. అలాంటివారు.. ఈ సమయంలో ఎవరైతే ఇబ్బందిపడుతున్నారో వారికి ఈ దీపావళి రోజున స్వెట్లర్లు, దుప్పట్లు లాంటివి  దానం చేయాలి. ఇది, ఈ రాశివారికి చాలా మంచి చేస్తుంది.

 

313
telugu astrology


 

2.వృషభ రాశి..

పండగ సంతోషం పంచుకోవడంతో మరింత పెరుగుతుంది. అందుకే వృషభ రాశివారు ఈ దీపావళి రోజున  స్వీట్లు, మిఠాయి లాంటివి పంచాలి. అది కూడా చిన్న పిల్లలకు పంచి పెట్టాలి. ఇది ఈ రాశివారికి శుభ ఫలితాలు ఇస్తుంది.

 

413
telugu astrology

 

3.మిథున రాశి..

మిథున రాశివారు ఈ దీపావళి రోజున శుభ ఫలితాలు పొందడానికి, శ్రేయస్సు పొందడానికి పక్షులకు ఆహారం, నీరు పెట్టాలి. 

 

513
telugu astrology

 

4.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు ఈ దీపావళి పండగ రోజున లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవిని పూజించిన తర్వాత.. ఎవరికైనా పేదలకు మినపప్పును దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కర్కాటక రాశివారికి శుభం జరుగుతుంది.

 

613
telugu astrology

 

5. సింహ రాశి..

సింహ రాశివారు ఈ దీపావళి రోజున నవ ధాన్యాలు పేదలకు దానం చేయాలి. ఇలా పేదలకు దానం చేయడం వల్ల.. కుటుంబంలో ఉన్న ధన సమస్యలు, పేదిరకం మొత్తం తొలగిపోతాయి.

 

713
telugu astrology

 

6.కన్య రాశి..

కన్య రాశివారు ఈ దీపావళి రోజున  మీ ఇంటికి సమీపంలో ఉన్న శనీశ్వర ఆలయానికి వెళ్లి.. ఆ రోజున ఆవనూనె దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గిపోతాయి.

 

813
telugu astrology

 

7.తుల రాశి..

తుల రాశివారు ఈ దీపావళి రోజున  పేదలకు ఆహారం లేదంటే డబ్బు దానం చేయాలి. పేదలకు ఇలాంటి దానం చేయడం వల్ల..  ఈ రాశివారికి మేలు జరుగుతుంది.

 

913
telugu astrology

 

8.వృశ్చిక రాశి..

దీపావళి పండగ రోజున వినాయకుడు, లక్ష్మీ దేవిని పూజించిన తర్వాత.. ఈ రాశివారు అవసరంలో ఉన్నవారికి దుప్పట్లు లాంటివి డొనేట్ చేయాలి. ఇలా చేస్తే.. వృశ్చిక రాశివారికి  మేలు జరిగే అవకాశం ఉంది.

 

1013
telugu astrology

 

9.ధనస్సు రాశి..

 

ధనస్సు రాశివారు  ఈ దీపావళి పండగ రోజున ఏదైనా ఆహారం అరటి ఆకులో పెట్టి.. దానిని ఆవుకు అందించాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశివారికి మంచి జరుగుతుంది. కోరుకున్నవి లభిస్తాయి.

 

1113
telugu astrology

 

10.మకర రాశి..

మకర రాశివారు ఈ దీపావళి రోజున ఏదైనా ఒక రకం పప్పును  దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మకర రాశివారికి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

 

1213
telugu astrology

 

11.కుంభ రాశి..

కుంభ రాశివారికి ఈ దీపావళి రోజున ఏదైనా కొత్త వస్తువులను లేదంటే ఆహారాన్ని.. పేదలకు లేదంటే అనాథ పిల్లలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుంభ రాశివారికి లాంగ్ లైఫ్ లభిస్తుంది.

 

1313
telugu astrology

 

12.మీన రాశి..

మీన రాశివారు ఈ దీపావళి రోజున ఏదైనా పేద కుటుంబానికి చెందిన  ఎవరైనా విద్యార్థికి విద్యా దానం చేయడం వల్ల.. మీకు శుభం జరిగే అవకాశం ఉంది.


 

Read more Photos on
click me!

Recommended Stories