గరుడ పురాణం ప్రకారం,చనిపోయిన వ్యక్తి మళ్లీ ఎంత కాలానికి పుడతాడు..?

First Published | Oct 21, 2024, 3:31 PM IST

చనిపోయిన ఎంత కాలానికి పుడతాడు..? దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతుంది..? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…

What Happen After Death

గరుడ పురాణం హిందూ మతం అతి ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి. ఈ గరుడ పురాణంలో మానవుల జీవితం, మరణం, తదుపరి ప్రయాణం అంటే.. మరణం తర్వాత ఏం జరుగుతుందో వివరించారు. అంతేకాకుండా.. మనిషి వివిధ కర్మలకు వేర్వేరు శిక్షలు కూడా వివరించారు. ఒక మనిషి మరణించిన తర్వాత పునర్జన్మ ఉంటుందా..? ఒకవేళ ఉంటే.. చనిపోయిన ఎంత కాలానికి పుడతాడు..? దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతుంది..? ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…

గరుడ పురాణాన్ని సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని దహన సంస్కారాల తర్వాత 13 రోజుల పాటు పఠిస్తారు. కానీ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎవరైనా చనిపోయిన తర్వాత మళ్లీ జన్మిస్తే.. ఆత్మ ఎప్పుడు, ఎక్కడ, ఎన్ని రోజుల తర్వాత పునరజన్మ పొందుతుంది? 

Latest Videos


What happens after death

మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?

గరుడ పురాణం ప్రకారం, ఏ వ్యక్తి చనిపోయిన తర్వాత, అతని ఆత్మ చాలా దూరం ప్రయాణిస్తుంది. ముందుగా ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. దీని తరువాత, చనిపోయిన వ్యక్తి పనులు యమరాజు ముందు లెక్కిస్తారు.

ఎక్కువ పాపాలు చేస్తే యమదూత మీ ఆత్మను శిక్షిస్సతాడట. మీరు మంచి పనులు చేసి ఉంటే.. మీ ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుందట. మరణానంతరం యమరాజును చేరుకోవడానికి ఆత్మ దాదాపు 86 వేల యోజనాలు ప్రయాణించవలసి ఉంటుందని గరుడ పురాణంలో పేర్కొన్నారు.

How your dead relatives will communicate with you, what Garuda purana says

పునర్జన్మను ఎలా నిర్ణయిస్తారు..?

మరణం తర్వాత 3 రోజుల నుండి 40 రోజులలోపు పునర్జన్మ వస్తుందని నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి పునర్జన్మ అతని కర్మ ఆధారంగా మాత్రమే నిర్ణయిస్తారు, ఎందుకంటే పాపాత్ముడి ఆత్మ నరకానికి పంపుతారు.పుణ్య-శుద్ధమైన ఆత్మ స్వర్గానికి పంపుతారట.

What Garuda Purana tells about death

ఒక వ్యక్తి ఆత్మ అతని కర్మల ప్రకారం శిక్షించినప్పుడు, అతను మళ్ళీ మరొక జన్మ తీసుకుంటాడట తదుపరి జన్మ ఏ పరిస్థితిలో జరగాలి? చెడుగా పుట్టారా? మీరు మంచిగా పుట్టారా? మీరు ధనవంతులు అవుతారా? లేక పేదవాడిగా పుట్టాడా? ఇదంతా అతని కర్మపై ఆధారపడి ఉంటుంది.

click me!