పళని మురుగన్ ఆలయం(తమిళనాడు) - పళని పంచామృతం
పళని పుణ్యక్షేత్రంలో పార్వతీపరమేశ్వరుల తనయుడైన కుమార స్వామి కొలువుదీరి ఉన్నాడు. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఉంది. కోయంబత్తూర్, మధురై, కొడైకెనాల్ కు సుమారు సమాన దూరంలో ఉంది. ఆలయ పురాణం ప్రకారం కుమార స్వామి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులపై అలిగి పళని కొండపై వెలిశాడని భక్తులు నమ్ముతారు. తనను తాను తెలుసుకోవడం కోసం సన్యసించాడని, అందుకే శరీరంపై దుస్తులు కూడా లేకుండా విగ్రహ రూపంలో కొలువైయ్యాడని భక్తుల విశ్వాసం.
పళనిలో స్వామికి అభిషేకించి ఇచ్చే పంచామృతం చాలా ఫేమస్. దీని తయారీలో అరటిపండ్లు, జవ్వాడ గోధుమలు, నెయ్యి, తేనె, చక్కెర తదితర పదార్థాలు ఉపయోగిస్తారు. ఈ ప్రసాదానికి 2019లో GI హక్కులు వచ్చాయి. అందువల్ల ఈ పళని ప్రసాదాన్ని ఎక్కడా వ్యాపారం చేయడానికి తయారు చేయకూడదు.