మంగళవారం నాడు ఈ పనులు చేస్తే మీ ప్రతి కోరికా నెరవేరుతుంది..

First Published | Sep 12, 2023, 9:38 AM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మంగళవారం నాడు కొన్ని ప్రత్యేక పనులు చేయాలనే నిబంధన ఉంది. ఇలా చేస్తే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 
 

మంగళవారం ఆంజనేయస్వామికి అంకితం చేయబడింది. ఈ రోజు అందరూ హనుమంతుడిని పూజిస్తారు. అంతేకాదు ఈయన భక్తులు ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు. జ్యోతిష శాస్త్రంలో మంగళవారం నాడు కొన్ని పనులను చేయాలనే నిబంధన కూడా ఉంది. ఇలా చేయడం వల్ల మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. అలాగే అన్ని మంచి పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే మీ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు, పురోగతి పొందుతారు. ఇందుకోసం ఈ రోజు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారు మంగళవారం నాడు హనుమంతుడిని ఆరాధించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే హనుమంతుడికి నైవేద్యాన్ని కూడా సమర్పించండి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల హనుమంతుడి ఆశీస్సులు మీపై ఉంటాయట. ఆయన అనుగ్రహంతో మీరు కోరుకున్న విజయాన్ని పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 


2. కొందరి జాతకంలో మంగళ దోషం కూడా ఉంటుంది. ఈ దోషం పోవాలంటే నివారణ తప్పనిసరి చేయాలి.  మంగళ దోష ప్రభావాన్ని తగ్గించడానికి మంగళవారం నాడు ఎండు మిరపకాయలను దానం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. మంగళవారం నాడు ఎర్ర మిరపకాయలను దానం చేయడం వల్ల మంగళ దోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్యులు వెళ్లడిస్తున్నారు.

suryamukhi hanuman

3. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మంగళవారం శ్రీరాముడితో పాటుగా హనుమంతుడిని కూడా ఆరాధించండి. అలాగే ఆరాధన సమయంలో రామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల మీ బాధలు, పాపాలు తొలగిపోతాయి. 
 

Hanuman

4. హనుమంతుడి అనుగ్రహం పొందాలనుకుంటే మంగళవారం నాడు తల స్నానం చేసి ఎర్రటి దుస్తులను వేసుకోండి. ఆ తర్వాత హనుమంతుడిని పూలతో పూజించాలి. అయితే హనుమంతుడికి ఎరుపు రంగు పండ్లు, పువ్వులను మాత్రమే సమర్పించండి. అలాగే కుంకుమపువ్వును కూడా హనుమంతుడికి సమర్పిస్తాడు. 
 

veera hanuman

5. వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు అప్పులను అసలే ఇవ్వకూడదు. అందుకే మంగళవారం నాడు ఎవరికీ అప్పు ఇచ్చే పనులను పెట్టుకోకండి. అలాగే మీరు కూడా ఎవరి దగ్గరా అప్పు తీసుకోకండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. లేదంటే మీ ఆర్థిక స్థితి మరింత దిగజారుతుంది. 

Latest Videos

click me!