ఆదివారం ఈ పనులు చేస్తే మీ సంపద, అదృష్టం పెరుగుతాయి

First Published | Sep 10, 2023, 11:28 AM IST

హిందూ మతంలో ప్రతి రోజూ ఒక దేవుడికి, ఒక నిర్ధిష్ట గ్రహానికి అంకితం చేయబడింది. కాగా ఆదివారం సూర్యభగవానుడి అంకితం చేయబడింది. ఈ రోజు సూర్య దేవుడుని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

sunday fasting

జ్యోతిష్య శాస్త్రంలో ఆదివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు సింహ రాశి పాలక గ్రహం అయిన సూర్యుడితో సంబంధం కలిగి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ జాతకంలో సూర్యుడు శక్తివంతమైన స్థానంలో ఉన్నప్పుడు మీ జీవితంలో కీర్తి, సంపద, ఆనందం పొందుతారు. అంతేకాదు మీరు అనుకున్న పనులను పూర్తిచేయగలుగుతారు. అలాగే జీవితంలో విజయం సాధిస్తారు. అయితే ఇందుకోసం ఆదివారం నాడు కొన్ని పనులను చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

పురాతన కాలం నుంచి మన జీవితంపై గ్రహాల ప్రభావాలను సమతుల్యం చేయడానికి కొన్ని నివారణలను చేస్తారు. దీంతో మన సంపద, కీర్తి పెరుగుతాయని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వారంలోని ఇతర రోజుల కంటే ఆదివారం ఎంతో ప్రత్యేకమైంది. మరి ఈ రోజున ఏలాంటి పనులను చేస్తే మీ సంపద పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


sandal powder

ఎరుపు రంగు దుస్తులు

రెడ్ కలర్ దుస్తులు సూర్య భగవానుడికి సంబంధించిన రంగు. అందుకే ఆదివారం నాడు మీ అదృష్టం పెరగడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదివారం నాడు మీరు ఏ పనిమీదైన బయటకు వెళుతుంటే.. నుదిటికి ఖచ్చితంగా గంధపు తిలకాన్ని పెట్టుకోండి. ఇది మీ పనిలో విజయాన్ని పొందడానికి సహాయపడుతుంది. 
 

ఈ వస్తువులను దానం చేయండి

ఆదివారం నాడు అవసరమైన వారికి మీరు బియ్యం, పాలు, బెల్లం, బట్టలను దానం చేయొచ్చు. వీటిని దానం చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు మీరు చేపట్టిన పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. విజయం సాధిస్తారు. అలాగే మీ సంపద పెరుగుతుంది. ఇంట్లో ఆనందం వెళ్లి విరుస్తుంది.
 

సూర్యదేవుడికి అర్ఘ్యం సమర్పించండి

ఆదివారం రోజున సూర్యభగవానుడికి అర్ఘ్యం ను సమర్పించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే మీరు అర్ఘ్యం  చేసేటప్పుడు ఓం సూర్యాయ నమ:, ఓం వాసుదేవాయ నమ: ఓం ఆదిత్య నమం: అనే మంత్రాలను పఠించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 
 

ఈ మంత్రాలను పఠించండి

ఆదివారం రోజున కొన్ని మంత్రాలను పఠిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. గాయత్రి మంత్రాన్ని పఠిస్తే సూర్యభగవానుడి ఆశీస్సులు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆదివారం ఈ మంత్రాన్ని పఠిస్తే మీ మానసిక ఆరోగ్యం బాగుటుంది. మీ ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 

Latest Videos

click me!