వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు ఈ వాస్తు నియమాలను ఖచ్చితంగా పాటించండి.. లేదంటే?

First Published | Sep 11, 2023, 9:42 AM IST

Ganesh Chaturthi 2023: వినాయక చవితి నాడు శివుడి కుమారుడైన బొజ్జ గణపయ్యను పూజిస్తారు.  అంతేకాదు ఆ రోజు ఉపవాసం కూడా ఉంటారు. వినాయకుడి ఆశీస్సులు ఉంటే ఇంట్లో సుఖసంతోషాలు వెళ్లివిరుస్తాయని నమ్మకం.
 

Ganesh Chaturthi 2023: సనాతన పంచాంగం ప్రకారం.. ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి రోజున వినాయక చతుర్థి పండుగను ఘనంగా జరుపుకుంటారు. కాగా ఈ సంవత్సరం వినాయక చవితి ఈ నెల అంటే సెప్టెంబర్ 19న వస్తుంది. భోళాశంకరుడికి కుమారుడైన వినాయకుడిని ఈ రోజున పూజిస్తారు. అలాగే ఉపవాసం ఉంటారు. ఈ ఉత్సవాలను 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఇన్ని రోజులు వినాకుడిని నిష్టగా పూజించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

వినాయకుడిని పూజించడం వల్ల మన జీవితంలోని అన్ని రకాల దుఃఖాలు, కష్టాలు, సంక్షోభాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే వినాయక చవితికి ఏర్పాటు చేసిన మండపాల్లోనే కాకుండా ఇండ్లలో విగ్రహాన్ని ప్రతిష్టించేవారు కూడా ఉన్నాయి. ఇలాంటి వారు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. కొన్ని నియమాలను పాటిస్తే ఆరాధన ఫలాలు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


దేవతలకు దేవుడిగా గణపయ్యను పూజిస్తారు. అయితే గణేషుడి ప్రతిమను కొనేటప్పుడు అతని భంగిమను గుర్తుంచుకోండి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లలితాసనంలో ఉన్న గణపయ్య విగ్రహాన్ని కొని ఇంటికి తీసుకొస్తే అంతా శుభమే జరుగుతుంది. ఇలాంటి విగ్రహాన్ని తీసుకొస్తే మీ ఇంట్లో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఇలాంటి భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు.

బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు.. తొండం దిశను కూడా బాగా గుర్తుంచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం.. విగ్రహంలోని వినాయకుడి తొండం ఎడమ వైపునకు వంగి ఉండాలి. ఇలాంటి విగ్రహాన్ని పూజించడం వల్ల మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. అలాగే సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే వినాయకుడికి కుడివైపున తొండం వంగి ఉన్న విగ్రహాన్ని తీసుకురావొద్దు. ఇలాంటి విగ్రహం అశుభప్రదంగా పరిగణించబడుతుంది. 

వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే సింధూరం రంగులో గణపయ్య విగ్రహాన్ని ఇంటికి తీసుకురండి. అలాగే బొజ్జ గణపయ్యను ఆచారాలతో పూజించండి. ఇలా చేస్తే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాగా ఇంటికి తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావడం కూడా శుభప్రదమే. ఇలాంటి విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

తన భార్యలు రిద్ది-సిద్ధిలతో ఉన్న గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దిశను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు జ్యోతిస్యులు. వాస్తు శాస్త్రం ప్రకారం.. దేవతల విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్టించడం శుభదాయకం. అందుకే గణపతి విగ్రహాన్ని ఉత్తరదిశలో ప్రతిష్ఠించండి. అంతేకాదు వినాయకుడి ముఖం మీ ఇంటి ప్రధాన ద్వారం వైపున ఉండేట్టు చూసుకోవాలి. 
 

వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే? మోదకాలు బొజ్జ గణపయ్య చేతిలో ఖచ్చితంగా ఉండాలి. అలాగే విఘ్నేషుడి విగ్రహంతో పాటుగా ఎలుక కూడా ఉండాలి. ఎందుకంటే ఎలుక వినాయకుడికి వాహనం.

Latest Videos

click me!