శనివారం ఈ పనులు చేస్తే.. మీకున్న అన్ని సమస్యలు పోతయ్..

First Published | Aug 26, 2023, 10:15 AM IST

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. శనిదేవుడు మన కర్మలకు అనుగుణంగా ఫలాలను ఇస్తాడు. అంటే మంచి పనులు చేసేవారికి అంతే మంచే చేస్తాడు. చెడు పనులు చేసేవారిని శిక్షిస్తాడు. 
 

శని దేవుడిని శనివారం రోజున ఖచ్చితంగా పూజించాలనే ఒక నియమం ఉంది. శనీశ్వరుడిని న్యాయదేవుడు, కర్మదాత అని కూడా అంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. శనిదేవుడు మన కర్మలకు అనుగుణంగానే ఫలాలను ఇస్తాడు. అంటే మంచి పనులు చేసేవారికి మంచి ఫలితాలనే ఇస్తాయి. చెడు పనులు చేసేవారిని శిక్షిస్తాడు. శనీశ్వరుని కృపను పొందితే ఒక వ్యక్తి చిన్న స్థాయి నుంచి రాజు అవుతాడట. సాధకులు జీవితంలో ఉన్న దుఖం, బాధలను తొలగించడానికి శని దేవుడిని శనివారం రోజున పూజిస్తారు. మీరు కూడా శనిదేవుని అనుగ్రహం పొందాలనుకుంటే శనివారం రోజున ఈ పనులను ఖచ్చితంగాచేయండి. అవేంటంటే..

నల్లకుక్కకు ఆహారం

శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే శనివారం రోజు కుక్కకు అంటే నల్ల కుక్కకు సేవ చేయాలి. అంటే నల్ల కుక్కను ఆహారంపెట్టండి. ఈ పరిహారాన్ని చేయడం ద్వారా శనీశ్వరుడు సంతోషంగా ఉంటారు. ఇంటి సేవ చేసిన వారిపైనే శనిదేవుని అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.


పేదలకు దానం

శనిదేవుడిని కర్మ ప్రదాత అని కూడా అంటారు. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి శనివారం రోజున శుభకార్యాలను చేయాలి. ఇందుకోసం మీరు పేదలకు, నిస్సహాయులకు సేవ చేయొచ్చు. వీరికి ఆహారం ఇవ్వొచ్చు. అలాగే వారి మెరుగైన ఆరోగ్యం కోసం మీరు మందులు కూడా ఏర్పాటు చేయొచ్చు. ఈ విధంగా మీరు మంచి పనులు చేయడం వల్ల శని దేవుని అనుగ్రహాన్ని పొందుతారు. 
 

నల్ల నువ్వులు

వ్యాపారంలో పురోగతిని సాధించాలనుకుంటే శనివారం రోజు స్నానం చేసి ధ్యానం చేయాలి. ఆ తర్వాత రావిచెట్టుకు నల్ల నువ్వులు కలిపిన నీటిని సమర్పించాలి. అలాగే స్వచ్ఛమైన నెయ్యి దీపాలు వెలిగించడం ద్వారా సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఆదాయం పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో ఆశించిన విజయం సాధిస్తారు.

ఆంజనేయ స్వామి పూజ

మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తితే శనివారం నాడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని పూజించండి. ఈ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనివారం హనుమంతుడిని పూజించడం వల్ల కూడా శనిగ్రహం తొలగిపోతుందని చెబుతారు.

Latest Videos

click me!