ఎండిపోయిన తులసి మొక్కను ఏం చేయాలి..? తులసిని ఇంట్లో ఏ దిశలో పెంచాలి?

First Published | Oct 6, 2021, 2:26 PM IST

తులసి ఆకులను అవసరం లేకుండా తుంచకూడదు. కేవలం మతపరమైన లేదా ఆరోగ్యపపరమైన అవసరాలకు మాత్రమే.. ఆకులను ఉపయోగించాలి.

తులసి మొక్క, తులసి ఆకులను పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాం. పురాణాల ప్రకారం, తులసి ఆకులను తొలగించేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి  వాటిని పాటించకపోతే, అది మిమ్మల్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.  తులసి ఆకులను తుంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఏం చేయాలి.. ఏం చేయకూడదో ఇప్పుడు చూద్దాం..


ఏకాదశి రోజున తులసిని తొలగించవద్దు: ఏ ఏకాదశి, రాత్రి, ఆదివారం, చంద్రగ్రహణం , సూర్యగ్రహణాలలో తులసి ఆకులను తుంచకూడదు, మొక్కను తొలగించకూడదు . ఈ రోజుల్లో తులసి ఆకులను తుంచడం వల్ల మనకు అందాల్సిన మంచి ఫలితాలు అందవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో దురదృష్టం కలుగుతుందని నమ్ముతారు. ఆదివారాలలో తులసి మొక్కకు నీరు కూడా పోయకూడదట.

Latest Videos


తులసి ఆకులను గోళ్లతో ఎప్పుడూ కత్తిరించవద్దు: తులసి  మొక్కను ఎండ తగిలేలా పెంచాలి. చీకట్లో పెంచకూడదు. ప్రతిరోజూ సాయంత్రం తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం మంచి చేస్తుంది. అంతేకాకుండా.. తులసి ఆకులను గోళ్లతో తుంచకూడదు. 

తులసి ఆకులను అవసరం లేకుండా తుంచకూడదు. కేవలం మతపరమైన లేదా ఆరోగ్యపపరమైన అవసరాలకు మాత్రమే.. ఆకులను ఉపయోగించాలి.
 

స్నానం చేయకుండా తులసి ఆకులను తాకకూడదు. తులసి ఆకులో ఉండే ఆమ్లాలు దంతాలకు హాని చేస్తాయట. కాబట్టి.. డైరెక్ట్ గా ఆకులు తినకుండా.. నీటిలో మరిగించి తాగడం మంచిదని సూచిస్తున్నారు.
 

ఎండిపోయిన తులసి ఆకులను పడేయడం చేయకూడదు. ఆ  ఆకులను తులసి కోటలోని మట్టిలోనే వేయాలట. అలా చేయడం వల్ల మొక్క మంచిగా పెరుగుతుందట.
 

ఎండిపోయిన తులసి మొక్కలను కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. మొక్క పవిత్రమైనది కాబట్టి.. ఏదైనా నదిలో  లేదా బావిలో వేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎండిపోయిన తులసి మొక్క ఇంట్లో ఉంచడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

ఇంటికి ఆగ్నేయ మూలలో తులసి మొక్క ఉంచకూడదు. తులసి మొక్కను భూమిలో నాట కూడదు. ఏదైనా కుండీలో పెంచుుకోవడం మంచిది. 


తులసి మొక్క సమీపంలో.. చెత్త పడేయకూడదు. శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త డబ్బాలు, చీపిరి లాంటి వి ఉంచకూడదు. ఏదైనా ముళ్లు ఉన్న మొక్క దగ్గర తులసి మొక్క ఉంచడం మంచిది కాదు. 
 

click me!