నరక చతుర్దశి రోజు ఇంట్లో ఆడపడుచుల హారతి ఎందుకు ఇస్తారో తెలుసా?

First Published | Nov 3, 2021, 12:07 PM IST

హిందువులు చేసుకునే పండగలలో ముఖ్యమైన పండుగ దీపావళి (Diwali). ఈ దీపావళి రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించి నైవేద్యాలు సమర్పించి ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని భక్తులు కోరుకుంటారు. ప్రతి ఏటా ఈ పండుగను ఆశ్వయుజ మాసం లో చివరి అమావాస్య (Amavasya) రోజున జరుపుకుంటారు. ఇక ఈ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి నిండా దీపాలతో చీకటిని తరిమికొడతారు.
 

ఇక దీపావళి రోజు ఎంత ముఖ్యమో దీపావళి ముందు రోజు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే  ఈ దీపావళి ముందు రోజు ఆడపడుచులు తమ ఇంట్లో వాళ్లకి హారతులు (Harathi) అందిస్తారు. దీపావళి ముందు రోజు ఆశ్వయుజ మాస నరక చతుర్దశి (Naraka Chaturdashi) వస్తుంది. ఇక ఈరోజు అనగా నరకచతుర్దశి రోజు ఉదయాన్నే సూర్యుడు రాకముందుకే నిద్ర లేవాలి.
 

దేవతలకు, బ్రాహ్మణులకు, పెద్దలకు, తల్లికి, గోవులకు హారతులు ఇచ్చి వారి దీవెనలు (Blessings) అందుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆరోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించాలి. ఇంట్లో దేవతల పూజలు చేసుకోవాలి. తర్వాత తోబుట్టువుల  (Siblings) (అక్క చెల్లెలు,  అన్న తమ్ముళ్లు) తలపై నువ్వుల నూనె పెట్టి వారి నుదుట కుంకుమ బొట్టు పెట్టి మంగళ హారతులు ఇవ్వాలి.
 

Latest Videos


ఇలా చేయడం వల్ల మరి మధ్య ఉన్న ప్రేమానురాగాలు,  అనుబంధాలు పది కాలాల వరకు సంతోషంగా (Happy) ఉంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. అలా తోబుట్టువుల నుండి హారతులు అందుకున్న తర్వాత ముఖ్యంగా ఆడపడుచుల నుండి హారతులు తీసుకున్న తర్వాత వారిని దీవించి వారికి బహుమతులు (Gifts) అందజేయాలి. ఈరోజు తమలో ఉన్న కొన్ని దోషాలు తొలగి పోవడానికి దీప దానం కూడా చేస్తారు.
 

ఇక ఈ రోజు తర్వాత అమావాస్య రోజు ఇంట్లో లక్ష్మీ పూజలు (Laxmi pooja) చేసుకొని ఇంటి నిండా దీపాలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇక ఈ రోజు దీపావళి పండుగ జరగటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నరకాసురుడు (Narakasurudu) రాక్షసుడిని చంపడం వల్ల అందరికీ ఆనందం కలుగుతుంది. దీంతో ప్రజలంతా కులమత బేధాలు లేకుండా దీపావళి పండుగను జరుపుకుంటారు.
 

అంతేకాకుండా శ్రీరాముడు (Sri Rama) కూడా రావణుడిని సంహరించడం వల్ల దీపావళి పండుగను జరుపుకుంటారు. అలా దైవ శక్తులు విజయం పొందినందుకు ప్రజలు ఇంతకాలం ఉన్న తమ చీకట్లను దీపాలతో (lightings) తరిమివేసి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు.
 

ఇక దీపావళి తర్వాత రోజు పాడ్యమి కార్తీక మాసం (Karthika masam) ప్రారంభమవుతుంది. ఇక ఈ రోజు నుంచి కార్తీక స్నానం ప్రారంభమవుతుంది. ఈ కార్తీకమాసంలో భక్తులంతా ఉదయాన్నే సూర్యోదయం రాకముందే లేచి స్నానమాచరించి ఇంట్లో దేవతలకు, తులసి (Tulasi) కోటకు దీపాలు  పెట్టి నమస్కరించుకుంటారు. ఇలా చేయడంవల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం.

click me!