దీపావళి పూజలో ఇలాంటి బట్టలను అస్సలు వేసుకోకూడదు

First Published | Nov 5, 2023, 11:26 AM IST

Diwali 2023: దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి పూజ చేస్తారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవని నమ్మకం. అయితే అమ్మవారికి పూజ చేసే సమయంలో కొన్ని రకాల బట్టలను వేసుకోకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటంటే? 
 

Diwali 2023: దీపావళి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజ చేస్తారు. ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే దీపావళి నాడు పూజ చేసేటప్పుడు కొన్ని ఆచారాలను పాటించడం చాలా ముఖ్యమని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీరు ధరించే బట్టలు, వాటి రంగుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది కొత్తగా అనిపించొచ్చు. కానీ దీపావళి పూజకు దుస్తులను ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

చిరిగిన దుస్తులు

దీపావళి నాడు కొత్త బట్టలు వేసుకోవాలని పెద్దలు ఎప్పుడూ చెప్పడం వినే ఉంటారు. అందుకే దీపావళి నాడు కొత్త బట్టలు కొనే సంప్రదాయం ఉంది. అయితే ప్రతి దీపావళికి అందరూ కొత్త బట్టలనే కొనుక్కోలేరు. కాబట్టి ఆ రోజు పాత బట్టలను కూడా వేసుకోవచ్చు. అయితే ఆ రోజు మీరు పాత బట్టలు వేసుకున్నా ఏం కాదు కానీ చిరిగినవి మాత్రం వేసుకోకండి. ఎందుకంటే వీటిని అశుభంగా భావిస్తారట.
 

Latest Videos


నలుపు దుస్తులు.. 

నలుపు రంగు మంచిది కాదన్న మాటను మీరు తరచుగా వినే ఉంటారు. అందుకే దీపావళి పూజకు మీరు బ్లక్ కలర్ బట్టలను వేసుకోకండి. అలాగే మీరు వేసుకున్న బట్టల్లో నలుపు ఎక్కడా లేదని నిర్దారించుకోండి. 

diwali 2023

మురికి దుస్తులు.. 

దీపావళి పూజకు మురికి బట్టలను కూడా వేసుకోకూడదు. లక్ష్మీదేవిని, వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇతర దేవుళ్ల మాదిరిగానే పరిశుభ్రమైన దుస్తులు ధరించడం చాలా ముఖ్యమంటున్నారు జ్యోతిష్యులు.

దీపావళి పూజకు ఏం ధరించాలి?

బట్టలు మన జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. అందుకే దీపావళి పండుగ నాడు శుభ్రమైన, ప్రకాశవంతమైన బట్టలను వేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ రాశిని బట్టి రంగును కూడా ఎంచుకోవచ్చు. 

click me!