ఈ దీపావళికి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇలా చేయండి.. మీ జీవితంలో డబ్బుకు కొదవే ఉండదు..!

First Published Nov 3, 2023, 2:05 PM IST

diwali 2023 : సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం భక్తులు లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని నమ్ముతారు. ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే ఇంట్లో డబ్బుకు లోటే ఉండదు. మరి ఈ రోజు దేవతను ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని పనులను చేయాలంటున్నారు జ్యోతిష్యులు. అవేంటంటే? 
 

దీపావళిని భారతదేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంటినిండా దీపాలు వెళిగించి టపాకాయలు కాలుస్తారు. అంతేకాదు ఈ రోజు లక్ష్మీదేవికి నిష్టగా పూజలు కూడా చేస్తారు. అందుకే ఈ రోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు. అలాగే ఆదాయం పెరుగుతుందని నమ్ముతారు. ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు, ఆరోగ్యం కోసం దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. 

మీరు కూడా ఆర్థిక సమస్యలతో బాదపడుతున్నారా. అయితే వీటి నుంచి బయటపడటానికి  దీపావళిని మించిన మంచి రోజు మరోటి లేదంటారు జ్యోతిష్యులు. అవును సంపద దేవత అయిన లక్ష్మీదేవి దీపావళి నాడు భూలోకానికి వస్తుందని నమ్ముతారు. మరి ఈ సందర్భంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే మార్గాలు..

మత విశ్వాసాల ప్రకారం.. దీపావళికి ముందే మీ ఇంటినంతా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే శుభ్రంగా ఉన్న ఇంట్లోకే అమ్మవారు ప్రవేశిస్తుందట. 

లక్ష్మీదేవికి శుక్రవారం అంకితం చేయబడింది. అందుకే ఆ రోజు అమ్మవారిని పూజిస్తారు. అయినప్పటికీ.. దీపావళి నాడు కూడా లక్ష్మీదేవిని పూజించాలి. దీనివల్ల మీ సిరిసంపదలు పెరుగుతాయట. 
 

లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే దీపావళి నాడు లక్ష్మీదేవి పూజలో అమ్మవారి మంత్రాలను పఠించండి. 

అమ్మవారికి తామర పువ్వులంటే ఎంతో ఇష్టం. అందుకే దీపావళి నాడు లక్ష్మీదేవికి తామర పువ్వులను సమర్పించండి. దీనివల్ల అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. 
 

దీపావళికి తులసి పూజ కూడా ఎంతో పవిత్రంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ రోజు తులసిమాత ముందు నెయ్యి దీపం వెలిగించండి. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. 

దీపావళి నాడు లక్ష్మీదేవితో పాటుగా శ్రీమహావిష్ణువును కూడా పూజించండి. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. 
 

click me!