diwali 2023: మనం జరుపుకునే ముఖ్యమైన, పవిత్రమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను దీపాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుంది కాబట్టి. అందుకే ఈ పండుగ ఇండియన్స్ కు ఎంతో ప్రత్యేకమైంది. ఈ పవిత్రమైన రోజున భక్తులు లక్ష్మీదేవితో పాటుగా వినాయకుడిని కూడా పూజిస్తారు. సుఖ శాంతులతో దీవించమని అమ్మవారిని వేడుకుంటారు.
దీపావళి పండుగ దీపాలు లేకుండా అసంపూర్ణమే అవుతుంది. అవును దీపావళి పండుగకు ఖచ్చితంగా దీపాలను వెలిగించాలనే సాంప్రదాయం ఉంది. జ్యోతిష్యుల ప్రకారం.. ఈ దీపాలు ప్రతికూల శక్తుల నుంచి కాపాడుతాయి. అయితే ఈ పండుగకు చాలా మంది 13 దీపాలను వెలిగిస్తారు. ఇలా ఇన్ని దీపాలనే ఎందుకు వెలిగిస్తారు? దీనివెనుకున్న రహస్యమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మొదటి దీపం: 13 మూడు దీపాల్లో మనం ముందుగా వెలిగించే దీపం మనల్ని, మన కుటుంబాన్ని అకాల మరణం నుంచి కాపాడుతుంది. 13 దీపాలను ధనత్రయోదశి నాడు దక్షిణ దిశలో వెలిగించాలి. అది కూడా ఇంటి బయట.
రెండో దీపం: రెండో దీపం శుభాలు కలగడానికి వెలిగిస్తారు. దీపావళి రాత్రి నెయ్యితో దీపాన్ని వెలిగించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ దీపాన్ని మీ ఇంట్లోని అనువైన చోట పెట్టాలి.
మూడో దీపం: మూడో దీపం లక్ష్మీదేవి ముందు వెలిగించాలి. తర్వాత సంపద, శ్రేయస్సు, విజయాలు కలగాలని అమ్మవారిని వేడుకోవాలి.
నాలుగో దీపం: ఈ దీపాన్ని తులసి మొక్క ముందు వెలిగించాలి. దీనివల్ల మీ ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది.
ఐదో దీపం: ఈ దీపాన్ని మీ ఇంటి ద్వారం ముందు పెట్టాలి. ఈ దీపం మీ ఇంటికి ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతుంది. అలాగే ఇంట్లో సంతోష వాతావరణాన్ని కలిగిస్తుంది.
ఆరో దీపం: ఆరో దీపాన్ని రావిచెట్టు కింద పెడతారు. ఈ దీపాన్ని ఆవనూనెతో వెలిగించాలి. ఈ దీపం ఆరోగ్య, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఏదో దీపం: ఈ దీపాన్ని ఆలయంలో వెలిగిస్తారు.
diwali 2023 kab hai
ఎనిమిదో దీపం: ఎనిమిదో దీపాన్ని డస్ట్ బిన్ దగ్గర వెలిగిస్తారు. ఈ దీపం ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను తిరిమికొడుతుందనే నమ్మకం.
తొమ్మిదవ దీపం: మన జీవితంలో సానుకూల శక్తిని తీసుకురావడానికి తొమ్మిదవ దీపాన్ని వెలిగిస్తారు.
పదవ దీపం: ఈ దీపం ప్రతికూల శక్తి నుంచి మనకు రక్షణగా నిలుస్తుంది. దీన్ని ఇంటి పైకప్పుపై వెలిగిస్తారు.
పదకొండవ దీపం: ఈ దీపం దుష్ట శక్తులతో పోరాడేందుకు సహాయపడుతుంది. దీన్ని ఇంట్లో కిటికీ దగ్గర పెడతారు.
పన్నెండవ దీపం: ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని ఇంటి పై అంతస్తులో పెడతారు.